DJ అంటే దువ్వాడ జ‌గ‌న్నాథం కాదు

February 21, 2017 at 6:11 am
allu arjun

ఫ‌స్ట్ లుక్‌తోనే అద‌ర‌గొట్టేశాడు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ రొటీన్‌కు భిన్నంగా స‌రికొత్త‌గా డీజే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి…సినిమాల‌పై అంచ‌నాల‌ను స్కైకు ట‌చ్ చేయించారు. బ‌న్నీ క్యారెక్ట‌ర్లో ఏ రేంజ్‌లో ఇన్వాల్ అయ్యాడో ఈ లుక్ చూస్తేనే తెలుస్తోంది. పాత స్కూట‌ర్ మీద వ‌స్తోన్న బ‌న్నీ లుక్ చూశాక సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ లైన్ సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ సినిమాలో బ‌న్నీ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఓ పాత్ర ఇలా.. బ్రాహ్మ‌ణ వంట‌వాడిగా క‌నిపిస్తే, రెండో గెట‌ప్‌లో మ‌నోడు ర‌హ‌స్య పోలీస్‌లా వ్య‌వ‌హారాలు చక్క‌బెడుతుంటాడ‌ట‌. అదుర్స్ క‌థ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ అక్క‌డ ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌. ఇక్క‌డ మాత్రం బ‌న్నీ ఒక్క‌డే అటు వంట‌వాడిగా, ఇటు పోలీస్‌గా డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ని గాసిప్స్ వ‌స్తున్నాయి.

ఓ రోజు దువ్వాడకి హీరోయిన్ కనపడుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా దువ్వాడ… ఆమె ప్రేమలో పడతాడు. ఇద్ద‌రి అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి. ఆమెకు వెస్ట‌ర్న్ క‌ల్చ‌ర్ అంటే ఇష్ట‌మ‌ని తెలుసుకున్న దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కాస్తా డీజేగా అంటే డిస్కో జాకీగా మారిపోతాడు.దీంతో దువ్వాడ లైఫ్ యూ ట‌ర్న్ తీసుకుంటుంద‌ట‌. త‌న‌కు తెలియ‌కుండానే డీజే ఎలా ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు ? వీటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

మొత్తానికి ఫ‌స్ట్ లుక్‌తోనే బ‌న్నీ హిట్ కొట్టాడు ? మ‌రి ఫైన‌ల్‌గా సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

DJ అంటే దువ్వాడ జ‌గ‌న్నాథం కాదు
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts