అన‌గ‌న‌గా ఓ “అర‌వింద స‌మేత‌” అంటూ అదరగొట్టాడు!

September 15, 2018 at 7:12 pm

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నారు. జై లవకుశ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింత సమేత వీర రాఘవ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మొదట్లో కొంత ఆలస్యంగా షూటింగ్ జరుపుకున్నా..ఈ మద్య వేగం పెంచింది. ఇక ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలసిందే. దాంతో ఈ షూటింగ్ నెల రెండు నెలలు గ్యాప్ వస్తుందని భావించారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ..ఈ నెల మొదటి రోజు నుంచి షూటింగ్ లో పాల్గొంటూ త్వరగా పూర్తి చేయడానికి సహకరించారు. తాజాగా అర‌వింద స‌మేత సంచ‌ల‌నాలు మొద‌ల‌య్యాయి. అభిమానుల‌కు మొద‌టి బ‌హుమ‌తి ఇచ్చేసాడు ఎన్టీఆర్. “అర‌వింద స‌మేత‌”లోని తొలి పాట విడుద‌లైంది. “అన‌గ‌న‌గా” అంటూ సాగే ఈ పాట‌కు అదిరిపోయే బీట్ ఇచ్చాడు థ‌మ‌న్. స్పైస్ – రొమాన్స్ ని తమన్ బాణీలో ఆవిష్కరించిన తీరు మెచ్చుకుని తీరాలి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కీలక సన్నివేశాల చిత్రణ సాగుతోంది.

సెప్టెంబర్ చివరి వారం నాటికి టాకీ పూర్తిచేసి – పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీపూర్తి చేస్తారు. దసరా కానుకగా అక్టోబర్ 10న సినిమా విడుదల చేయనున్నారు. సెప్టెంబ‌ర్ 20న “అర‌వింద స‌మేత” ఆడియో విడుదల కానుంది. అయితే వేడుక జ‌రుగుతుందా లేదా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సింగిల్ జోరుగా వైరల్ అవుతోంది. అనగనగనగ అరవిందట తనమేరు… అంటూ సాగే పాట తారక్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేపుతుంది.

అన‌గ‌న‌గా ఓ “అర‌వింద స‌మేత‌” అంటూ అదరగొట్టాడు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share