టాప్ హీరోతో మల్టీ స్టారర్ కి అనీల్ రెడీ

టాలీవుడ్‌లో నిన్న‌టి త‌రంలో ఈవీవీ.స‌త్య‌నారాయ‌ణ‌, జంధ్యాల సినిమాలు వ‌స్తున్నాయంటే థియేట‌ర్ల‌లో న‌వ్వులు నాన్‌స్టాప్‌గా వినిపించేవి. కామెడీ సినిమాలు తీయాలంటే జంధ్యాల త‌ర్వాత అంత‌టి క్రేజ్ ఒక్క ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ఒక్క‌డికే వ‌చ్చింది. ఈవీవీ త‌ర్వాత ఎంతోమంది ద‌ర్శ‌కుడు పూర్తిస్థాయిలో కామెడీ సినిమాలు తీసినా ఈ రేంజ్‌కు వెళ్ల‌లేక‌పోయారు. అయితే రీసెంట్‌గా ర‌వితేజ రాజా ది గ్రేట్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడిని ఈ త‌రంలో జంధ్యాల‌, ఈవీవీ రేంజ్‌లో కాక‌పోయినా మ‌ళ్లీ వాళ్ల‌ను ఓ సారి గుర్తు చేసే రేంజ్‌లో కామెడీ సినిమాలు తీస్తున్నాడ్రా అని టాలీవుడ్ జ‌నాలు గుర్తు చేసుకుంటున్నారు.

అనిల్ రావిపూడి తీసిన మూడు సినిమాలు ప‌టాస్ – సుప్రీమ్ – రాజా ది గ్రేట్ ఈ మూడు సినిమాల్లో పెద్ద స్టోరీ యేం ఉండ‌దు. పాత స్టోరీ లైన్‌కే ఫుల్ కామెడీ జోడించి సినిమాను హిట్ చేసేస్తున్నాడు ఈ త‌రం ప్రేక్ష‌కుడి కామెడీ ప‌ల్స్ తెలిసిన డైరెక్ట‌ర్‌గా అనిల్ రావిపూడి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. రాజా ది గ్రేట్ హిట్ త‌ర్వాత మ‌నోడికి మంచి ఛాన్సులే వ‌స్తున్నాయి.

చాలా మంది హీరోలు అత‌డితో పని చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే అనిల్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చేశాడు. F2 (ఫన్ అండ్ ఫ్రాస్ట్రేషన్) అనే టైటిల్‌తో అనిల్ రాబోతున్నాడు. టైటిల్‌లోనే సినిమా ఎలా ఉంటుందో ? చెప్పేశాడు. ఇక మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తెర‌కెక్కే ఈ సినిమాలో ఓ పాత్ర‌ను సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ చేయ‌బోతున్నారు. ఇక మ‌రో యంగ్ హీరో కోసం గాలింపులు మొద‌లుపెట్టార‌ట‌. నాని, శ‌ర్వానంద్‌, సాయిధ‌ర‌మ్.. ఇలా కొంత మంది హీరోల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే ఎవ‌రో ఒక‌ యంగ్ హీరోను ఫైన‌ల్ చేసి ప్రాజెక్టును ప‌ట్టాలెక్కించాల‌ని అనిల్ రావిపూడి భావిస్తున్నాడ‌ట‌. గ‌తంలో అనిల్ వెంకీ హీరోగా చేసిన మ‌సాలా సినిమాకు డైలాగ్స్‌ రాశాడు. ఈ సినిమాలో వెంకీ చెప్పిన ఇంగ్లీష్ డైలాగులు బాగా పేలాయి. ఇక ఈ F2 గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం.