అనుష్క ‘ భాగమ‌తి ‘ సెన్సార్ రిపోర్ట్ & ర‌న్ టైం డీటైల్స్‌

January 18, 2018 at 4:28 pm
Anushka, bhagamathi, movie, sensor report

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి ప్రత్యేకమైన సినిమాలలో తనదైన అభినయంతో ప్రేక్ష‌కుల్లో చెక్కు చెద‌రని ముద్ర వేసుకుంది స్వీటీ బ్యూటీ అనుష్క‌. ఈ సినిమాల్లో అనుష్క న‌ట‌న త‌ర్వాత ఇలాంటి లేడీ ఓరియంటెడ్ పాత్ర‌లు చేయాలంటే అనుష్క‌కే సాధ్య‌మా ? అని తెలుగు సినీజ‌నాలు ముక్కున వేలేసుకునేలా ఆమె ఈ పాత్ర‌ల‌తో అంత‌లా మైమ‌రిపించింది. తాజాగా అనుష్క న‌టించిన మ‌ర లేడీ ఓరియంటెడ్ సినిమా భాగ‌మ‌తి రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఎప్ప‌టి నుంచో షూటింగ్ జ‌రుపుకుంటూ లేట్ అవుతోన్న భాగ‌మ‌తి ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డంతో ఒక్క‌సారిగా ఇప్పుడు అంచ‌నాలు రైజ్ అయ్యాయి. ఈ సినిమాకు నాని పిల్ల జ‌మిందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించగా థ‌మన్ సంగీతం అందించాడు. ఇక తాజాగా ఈ రోజు భాగ‌మ‌తి సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు భాగ‌మ‌తికి క్లీన్ యూ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా ర‌న్ టైం మొత్తం 142 నిమిషాలుగా ఉంది. అంటే మొత్తం 2 గంట‌ల 22 నిమిషాలు. ర‌న్ టైం ప‌రంగా చూస్తే క‌రెక్ట్ ర‌న్ టైంలోనే మ‌రీ లెన్త్ ఎక్కువ లేకుండానే ఉన్న‌ట్లుంది. ఇక క్లీన్ యు సర్టిఫికేట్ రావ‌డం కూడా సినిమాకు ప్ల‌స్సే. ఇక అనుష్క ఈ సినిమాలో రెండు వైవిధ్య‌మైన లుక్స్‌లో క‌నిపించ‌నుంది. యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు, ఆది పినిశెట్టి, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

 

అనుష్క ‘ భాగమ‌తి ‘ సెన్సార్ రిపోర్ట్ & ర‌న్ టైం డీటైల్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share