షాకింగ్: అరెస్టు నుంచి త‌ప్పించుకున్న ముర‌గ‌దాస్‌

November 9, 2018 at 9:10 am
AR Murugadas, Escaped from Arrest, Chennai, Sarkar movie, Issue

కొంత‌కాలంగా ప్ర‌తీ సినిమా ఏదో ఒక అంశంలో వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. స‌న్నివేశాలు, డైలాగ్స్ త‌దితర అంశాలు త‌మ‌ను కించ‌ప‌ర్చేలా ఉన్నాయ‌ని ఆయా సంద‌ర్భాల్లో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా.. ద‌ర్శ‌కుడు మురుగదాస్‌, హీరో విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌ర్కార్ సినిమా కూడా తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఈ సినిమాలోని ప‌లు స‌న్నివేశాలు, డైలాగ్స్ త‌మ పార్టీని, పాల‌న‌ను కించ‌ప‌ర్చేలా ఉన్నాయ‌ని అన్నాడీఎంకే నాయ‌కులు మండిప‌డుతున్నారు. ఏకంగా ఆందోళ‌నలు చేశారు.

murugadoss

ఏకంగా ఓ మంత్రి మాత్రం తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. స‌ర్కార్ సినిమాలో హీరో విజ‌య్ మావోయిస్టులా న‌టించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సినిమాలోని ఆస‌న్నివేశాలు, డైలాగ్స్‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఇక కార్య‌క‌ర్త‌లైతే మ‌రింత‌గా రెచ్చిపోయారు. తమ పార్టీని కించపరిచేలా సన్నివేశాలు సర్కార్ సినిమాలో ఉన్నామని కార్యకర్తలు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కార్ థియేటర్లు వద్ద దాడికి దిగారు. విజయ్ కటౌట్‌లను ధ్వంసం చేసి.. సినిమా పోస్టర్లను చింపేశారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఈ నేప‌థ్యంలో మురగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విరుగంబక్కంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లినట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. పోలీసులు వచ్చింది ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కాదని, నిరసనల నేపథ్యంలో ఆయ‌న‌ ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం అందడంతో ఆయనకు భద్రత కల్పించేందుకేనని చెన్నై పోలీసులు అంటున్నారు. పోలీసులు మాత్రం మురుగదాస్ తన నివాసంలో లేకపోవడంతో ఆయన ఆచూకీ గురించి విచారించి వెళ్లిపోయారని సన్ పిక్చర్స్ సంస్థ చెబుతోంది.

ఏదేమైనా.. ఈ వివాదం స‌ర్కార్ సినిమా క‌లెక్ష‌న్ల‌ను మాంత్రం పెంచేసింది. సినిమా విడుద‌లైన రోజునే భిన్న‌మైన టాక్ వ‌చ్చింది. సినిమాలో పెద్ద‌గా విష‌యం ఏమీ లేద‌నే నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చాయి. కానీ.. ఇప్పుడు జ‌రుగుతున్న రాద్దాంతం సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసింది. త‌మిళ‌నాడుతోపాటు ఇత‌ర ప్రాంతాల్లోనూ వ‌సూళ్లు భారీగానే పెరిగిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. చూద్దాం మ‌రి ఈ వివాదం ఏద‌రికి చేరుతుందో…:

షాకింగ్: అరెస్టు నుంచి త‌ప్పించుకున్న ముర‌గ‌దాస్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share