
టాలీవుడ్ లో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి..సినిమా ఆలస్యం అవుతుందని అందరూ భావించారు..కానీ ఎన్టీఆర్ మాత్రం ఎంతో డెడికేషన్ తో షూటింగ్ లో పాల్గొన్నారు. మొత్తానికి షూటింగ్ తుది దశకు చేరుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ‘అరవింత సమేత’ నుంచి ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయ్ ..ఇప్పటికే వచ్చిన రేడు పాటలు మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. ఈ రోజు మిగతా రెండు పాటలు కలిపి జ్యూక్ బాక్స్ ని రిలీజ్ చేసారు…