`అర‌వింద‌ సమేత` ఆడియో రిలీజ్ ఉంటుంది కానీ…

September 14, 2018 at 9:19 am

అనేక ఊహాగానాలు..పుకార్ల‌కు తెర‌దించుతూ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ పాట‌లు వ‌చ్చేస్తున్నాయి.. కానీ ఎలాంటి హ‌డావుడి.. ఎలాంటి ఫంక్ష‌న్ లేకుండానే ఈనెల 20వ తేదీన‌ పాట‌లు విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. ఇది అభిమానుల‌కు కొంత నిరాశే అయినా.. అంత‌కుమించిన పండుగ తెచ్చేందుకు ఎన్టీఆర్ ప‌క్కా ప్లాన్‌తో ఉన్నారు. అదేమిటంటే.. సినిమా విడుద‌ల‌కు రెండుమూడు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు భారీ ఎత్తున నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డం. ఈ ఫంక్ష‌న్‌కు అటు నంద‌మూరి బాల‌క‌`ష్ణ‌, ఇటు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. పాట‌ల్ని మాత్రం ఇలా సాదాసీదాగా విడుద‌ల చేసేందుకు బ‌ల‌మైన కార‌ణాలే ఉన్నాయి.

ఇటీవ‌ల న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎన్టీఆర్ తండ్రి హ‌రిక‌`ష్ణ దుర్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. ఈ విషాదం నుంచి నంద‌మూరి ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇది జ‌రిగి నెల‌రోజులు కూడా కాక‌ముందే.. ఇలా భారీ ఎత్తున ఫంక్షన్ చేస్తే.. జ‌నంలోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌నే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆడియో రిలీజ్‌ను ఎలాంటి హ‌డావుడి లేకుండానే సైలెంట్‌గా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. నిజానికి.. ఆ రోజున ఎలాంటి ఫంక్షన్లు పెట్టరు. ప్రత్యేక అతిథులు ఎవరూ ఉండరు. చిన్న ప్రెస్ మీట్ కూడా ఉండద‌నే టాక్ వినిపిస్తోంది. యూట్యూబ్ తో పాటు, మరికొన్ని మ్యూజిక్ వెబ్ సైట్స్ లో మాత్ర‌మే పాటల్ని విడుదల చేయ‌నున్నారు.

అయితే ఇలా ఆన్‌లైన్‌లో పాట‌ల్ని పాటల్ని విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. ద‌స‌రాకు ముందు సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. విడుద‌ల‌కు ముందుకు ఏర్పాటు చేసే.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ మాత్రం నంద‌మూరి అభిమానుల‌కు పండుగ తెస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. మ‌రో కొత్త విష‌యం ఏమిటంటే.. ఈ స‌నిమా కాంబినేష‌న్లో కొంత కొత్త‌ద‌నం ఉండ‌డ‌మే.. అరవింద సమేత వీర రాఘ‌వ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్-తమన్ కాంబినేష‌న్ ప్రేక్ష‌కుల‌కు కొత్తేమీ కాదు.. కానీ… త్రివిక్రమ్-తమన్ కాంబినేష‌న్ మాత్రం కొత్తే. ఈ నేప‌థ్యంలో ఈ విల‌క్ష‌ణ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న అర‌వింద పాట‌ల కోసం అభిమానులు ఎంతో ఆత‌`త‌గా ఎదురు చూస్తున్నారు.

Dm5HM79UwAIDOSs

`అర‌వింద‌ సమేత` ఆడియో రిలీజ్ ఉంటుంది కానీ…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share