‘అరవింద సమేతం’గా…ఆ ‘రెడ్డి’ కోసమే ఎదురుచూపు!

September 20, 2018 at 4:09 pm

టాలీవుడ్ లో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి..సినిమా ఆలస్యం అవుతుందని అందరూ భావించారు..కానీ ఎన్టీఆర్ మాత్రం ఎంతో డెడికేషన్ తో షూటింగ్ లో పాల్గొన్నారు. మొత్తానికి షూటింగ్ తుది దశకు చేరుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ‘అరవింత సమేత’ నుంచి ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు.

DnhIt_8VYAEDBpB

ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట..ఇప్పటికే వచ్చిన సాంగ్ లో అరవిందను వర్ణించే ఫాస్ట్ మెలోడీ కావడంతో ఈ పాటలు హుషారెక్కించే డ్యాన్స్ లేదని అర్థం అయ్యింది. ఇక నిన్న రిలీజ్ చేసిన సాంగ్ లో పూర్తిగా హృదయవిదారకంగా సాగింది. ఫస్ట్ ది పెంచల్ దాస్ తో పాటు నికిత కైలాష్ ఖేర్ లు పాడారు కాబట్టి అది కీలకమైన సందర్భాన్ని బట్టి వచ్చే థీమ్ సాంగ్ గా కనిపిస్తోంది.

మరో సాంగ్ రెడ్డి ఇక్కడ చూడు హుషారైన గీతాలు పాడటంలో ప్రత్యేకమైన శైలి కలిగిన దలేర్ మెహందీ అంజనా సౌమ్యలు పాడారు. సో ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చే మాస్ ఐటెం డాన్స్ సాంగ్ ఇదే అని చెప్పొచ్చు. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలో ఒక సోలో సాంగ్..ఐటమ్ సాంగ్ ఉంటే..అందులో అభిమానులకు హుషారెత్తించే డ్యాన్స్ తో తెగ సంబర పడిపోతుంటారు..కానీ అరవింద సమేతలో నాలుగు పాటల్లో రెండు పాటలకే ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

జైలవకుశలో మంచి ఊపున్న పాటలు ఉన్న విషయం తెలిసిందే..అంతే కాదు ఇందులో ప్రత్యేకంగా తమన్నాను తీసుకొచ్చి మరీ అదరగొట్టారు. ఇక అరవింద సమేత వీర రాఘవ విషయంలో ఫ్యాన్స్ సర్దుకోకతప్పదు. అందుకే భారం మొత్తం రెడ్డి పాట మీదే పడుతోంది. పూర్తి ఆల్బమ్ ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది.

‘అరవింద సమేతం’గా…ఆ ‘రెడ్డి’ కోసమే ఎదురుచూపు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share