‘అరవింద సమేత’ ఫస్ట్ డే కలెక్షన్స్

October 12, 2018 at 10:18 am

టెంపర్ నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో పాటు చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు,.ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన హావభావాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ హిట్స్ లాగే ‘అరవింద సమేత’ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ లో దుమ్ము దులుపుతోంది. అడ్వాన్స్‌‌ బుకింగ్‌ కూడా భారీ స్థాయిలో జరిగింది. అమెరికాలోనూ తారక్ సత్తాచాటుతున్నాడు. అక్కడ మొత్తం 200పైగా థియేటర్లలో ప్రాంతాల్లో విడుదలైంది.

DpNQanfW4AAueIa

ఇక్కడ ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. ఇది తారక్ కు రికార్డు గా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమాను బీట్‌ చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ‘జైలవకుశ’ అమెరికాలో తొలి రోజు 589,219 డాలర్లు రాబట్టింది. ఇక ‘జనతా గ్యారేజ్‌’ 584,000 డాలర్లు రాబట్టింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అమెరికాలో ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ‘అరవింద సమేత’ అని విశ్లేషకులు అంటున్నారు.

ఇక నైజాంలో మొదటి రోజు రూ.8.30కోట్లు గ్రాస్ కాగా.. రూ.5.73కోట్లు షేర్ అయ్యాయి. ఇక సీడెడ్లో రూ. 5.48కోట్లు షేర్ అయ్యాయి. గుంటూరు జిల్లాలో రూ. 4,14కోట్లు, కృష్ణ జిల్లాలో 1.97 కోట్లు షేర్, నెల్లూరు రూ.1.06కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 3.12కోట్లు, ఈస్ట్ రూ.2.77కోట్లు,
వెస్ట్ రూ.2.37కోట్లు, నిజాం, సీడెడ్, గుంటూరు, కృష్ణా , నెల్లూరు, ఉత్తరాంధ్ర కలిపి మొత్తం సుమారు రూ. 27కోట్లు రాబట్టింది అరవింద సమేత సినిమా.

మరి ఎన్ని రోజుల్లో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందో వేచి చూడాలి. ఈ చిత్రం త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. హారిక-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు.

dwfe

‘అరవింద సమేత’ ఫస్ట్ డే కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share