ఎన్టీఆర్ రికార్డుల మోత…ఏకంగా నాలుగో సారి

October 14, 2018 at 11:38 am

అర‌వింద స‌మేత వీర రాఘ‌వుడు యూఎస్‌లో స‌త్తా చాటుతున్నాడు. ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్తున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మార్క్, ఎన్టీఆర్ ఎమోష‌న్ తోడుకావ‌డంతో అర‌వింద స‌మేత… సినిమా అమెరికా తెర‌పై దుమ్ముదులుపుతోంది. మొద‌టి రోజే జై ల‌వ‌కుశ సినిమాను మించిన వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డు స‌`ష్టించింది. యూఎస్‌లో త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్‌కు మాంచి ఫాలోయింగ్ ఉండ‌డంతో ప్రీమియ‌ర్ షో నుంచే వ‌సూళ్ల ప‌ర్వం మొద‌లైంది. బుధవారం నాటి ప్రిమియర్ల తోనే $797366 సాధించిన ఎన్టీఆర్ సినిమా గురువారం నాడు $242424 సాధించి వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.

ఇక శుక్రవారం నాడు $276477 కలెక్షన్స్ సాధించించాడు అర‌విందుడు. శనివారం మధ్యాహ్నానికి $198294 కలెక్షన్స్ తో టోటల్ ఒకటిన్నర మిలియన్ డాలర్లకు చేరింది. అరవింద సమేత… $1.5 మిలియన్ డాలర్ల మార్క్ సాధించడంతో తార‌క్ సరికొత్త రికార్డు స‌`ష్టించాడు. నిజానికి.. సౌత్ నుంచి ఓవ‌ర్సీస్‌లో ఒక్క‌ ఎన్టీఆర్ తప్ప మరే ఇతర హీరోకూ వరసగా నాలుగు సినిమాలు 1.5 మిలియన్ మార్క్ కు చేరుకోలేదు. ఇప్పటికే తార‌క్‌ ‘నాన్నకు ప్రేమతో’.. ‘జనతా గ్యారేజ్’.. ‘జై లవకుశ’ సినిమాలు 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. తాజాగా త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా 1.5 మిలియన్ డాల‌ర్ల‌ కలెక్షన్స్ సాధించి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

అయితే.. ఎన్టీఆర్ మిగ‌తా సినిమాల క‌లెక్ష‌న్ల‌న ఒక‌సారి చూద్దాం.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో'( $2022384). ప్రస్తుతం అక్క‌డ‌ ‘అరవింద సమేత’ కలెక్షన్స్ జోరు చూస్తుంటే వీకెండ్ పూర్తయ్యే సమయానికి 2 మిలియన్ డాలర్ క్ల‌బ్‌కు చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ ఫుల్ రన్ కలెక్షన్స్ దాటడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే.. అర‌వింద స‌మేత మాంచి విజ‌యాన్ని అందుకున్నా.. ఎన్టీఆర్ సంబురాల‌కు దూరంగా ఉంటున్నాడు. తండ్రి హ‌రిక‌`ష్ణ దుర్మ‌ర‌ణంతో నంద‌మూరి కుటుంబంలో విషాదం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్‌ను కూడా ఆన్‌లైన్‌లో సాదాసీదాగా చేసిన విష‌యం తెలిసిందే.

ఎన్టీఆర్ రికార్డుల మోత…ఏకంగా నాలుగో సారి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share