‘అరవింద సమేత’ ఓవర్సీస్ లో రికార్డుల మోత!

October 12, 2018 at 5:45 pm

ఇండస్ట్రీలో అందరూ ఊహించినట్టుగానే జరిగింది. టాప్ లీడ్ లో ఉన్న దర్శకుడు, హీరో కలిస్తే..ఏ రేంజ్ హిట్ వస్తుందో నిన్న రిలీజ్ అయిన ‘అరవింద సమేత’సినిమా చూస్తే అర్ధం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన ఈ సినిమా వాస్తవానికి దసరా ముందు రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నారు ఫ్యాన్. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారా..అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఐదో రోజు నుంచి షూటింగ్ లో జాయిన్ అయి సినిమా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైప్ తీసుకు వచ్చాయి.

9211-aravinda-sametha

నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోవడంతో రికార్డుల వేట షురూ అయింది. తెలుగు రాష్ట్రాల్లో నాన్-బాహుబలి రికార్డులపై ఈ చిత్రం కన్నేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ప్రిమియర్లతోనే ‘అరవింద సమేత’ 8 లక్షల డాలర్లు కొల్లగొట్టడం విశేషం. ఈ ఊపు చూస్తే వీకెండ్ అయ్యేసరికే 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా సినిమా జోరు కొనసాగితే 3 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడమూ పెద్ద కష్టం కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఈ సంవత్సరం రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’, మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’రెండు సినిమాలు దాదాపు గా 3.5 మిలియన్ డాలర్ల దగ్గర ఉన్నాయి. వీటి టార్గెట్ దాటిందా అంటే..నాన్-బాహుబలి రికార్డును ‘అరవింద సమేత’ఈజీగా రీచ్ కావొచ్చని అంటున్నారు ఫ్యాన్స్. కాకపోతే వచ్చే వారం రామ్ నటిస్తున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంటే..ఆ ఫలితాన్ని బట్టి ఉండొచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.

‘అరవింద సమేత’ ఓవర్సీస్ లో రికార్డుల మోత!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share