‘అర‌వింద స‌మేత’ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌: ఎన్టీఆర్‌, బాలయ్య!

October 2, 2018 at 8:36 am
Aravindha Sametha, Pre Release Event, NTR, Balakrishna, movie

చాలారోజులుగా బాల‌య్య‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ విష‌యం వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే.. బాబాయ్‌- అబ్బాయ్ క‌లుస్తారా..? అని. వారిద్ద‌రి మ‌ధ్య వైరం తొల‌గిపోయింద‌నీ.. ఇక ఎన్టీఆర్‌కి బాల‌య్య అండ‌గా ఉంటార‌ని.. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌కు ఆయ‌న వ‌స్తున్నార‌నీ.. జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. అంద‌రూ అనుకున్న‌ట్లుగా అర‌వింద స‌మేత సినిమా ఆడియో రిలీజ్ ఫంక్ష‌నే జ‌ర‌గ‌లేదు. సాదాసీదాగా ఆన్‌లైన్‌లో పాట‌ల్ని విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత అర‌వింద స‌మేత సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌కు బాల‌య్య బాబు రావ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది.

42980368_1912082668885122_5269686638946025472_o

కానీ.. అది కూడా ఉత్తి ముచ్చ‌టేన‌ని తేలిపోయింది. మంగ‌ళ‌వారం జ‌రుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు బాల‌య్య రావ‌డం లేద‌నీ.. అస‌లు అతిథులెవ‌రూ రావ‌డం లేద‌ని, కేవ‌లం సినిమా యూనిట్ మాత్ర‌మే పాల్గొంటుంద‌ని స్ప‌ష్ట‌మైంది. దీంతో బాబాయ్- అబ్బాయ్ క‌ల‌యిక ఇక క‌ష్ట‌మేన‌నే టాక్ వినిపిస్తోంది. రోడ్డు ప్ర‌మాదంలో నంద‌మూరి హరికృష్ణ ద‌ర్మ‌ర‌ణం చెందిన త‌ర్వాత‌.. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్‌కు బాల‌క‌`ష్ణ అండ‌గా ఉంటార‌నే టాక్ వినిపించింది. హరికృష్ణ మ‌ర‌ణం త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల్లో వీరంద‌రూ కూడా క‌లిసి ముచ్చ‌టించుకునే వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో క‌లిసిపోయార‌ని నంద‌మూరి అభిమానులు అనుకున్నారు.

వీరంద‌రి మ‌ధ్య టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌యోధ కుదిర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు కూడా టాక్ వినిపించింది. అయితే.. విషాదంలో ఉన్న ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌ను ప‌రామ‌ర్శించ‌డం వ‌ర‌కే బాలకృష్ణ ప‌రిమితం అయ్యార‌ని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అర‌వింద సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు ఆయ‌న రావ‌డం లేద‌ని తేలిపోవ‌డంతో నంద‌మూరి అభిమానుల ఊహాగానాలకు తెర‌ప‌డింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి సినిమా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. ఇప్ప‌టికే ఈ సినిమా పాట‌ల‌కు అనూహ్య స్పంద‌న వ‌స్తోంది.

‘అర‌వింద స‌మేత’ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌: ఎన్టీఆర్‌, బాలయ్య!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share