‘అరవింద సమేత’లో అన్యాయం జరిగిందా!

October 12, 2018 at 1:00 pm

టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అరవింద సమేత’. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగిన ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా అందరి అంచనాలు అందుకున్నాయని కొంత మంది అంటే..ఎంట్రటైన్ మెంట్ తగ్గిందని మరికొంత మంది కామెంట్ చేశారు. ఏది ఏమైనా రిలీజ్ అయిన అన్ని సెంటర్లో మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే దుమ్మురేపే కలెక్షన్లు సాధించింది.

Peniviti-Song-Promo-Aravindha-Sametha-Jr

అంతా బాగుంది..కానీ ఈ సినిమాలో ఒక పాట విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. పెనిమిటి సాంగ్.. తమన్ కంపోజ్ చేసిన ది బెస్ట్ సాంగ్స్ లో ఒకటి. సంగీతమే కాదు, సాహిత్యం పరంగా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఈ పాటను మాత్రం సినిమాలో రాంగ్ ప్లేస్ లో వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మనసుకు హత్తుకునే పదాలవి. అలాంటి పాటకు అరవింద సమేతలో అన్యాయం జరిగిందని అంటున్నారు. అలాగే ‘రెడ్డి’ ఇక్కడ సూడు పాట కూడా సందర్భాను సారంగా వచ్చిందని పెదవి విరుస్తున్నారు.

ఎలాంటి సందర్భం లేకున్నా, కేవలం ఆ పాటను పెట్టడం కోసం ఎన్టీఆర్ తో కొన్ని డైలాగ్స్ చెప్పించి పాటను కొనసాగిస్తారు. అంతే కాదు ఈ పాట చిత్రీకరణలో కూడా అన్యాయం చేశారు. అసలు ఈ పాట అర్థమేంటి..ఆడియో రిలీజ్ అయినపుడు అందరి ఎక్స్ పెక్టేషన్స్ ఏంటీ..తీరా థియేటర్లో ఆ పాట చూసి వెస్ట్రన్ బ్యాక్ డ్రాప్, పొట్టి నిక్కర్లు వేసుకున్న అమ్మాయిలు, పార్టీ కల్చర్ ను తలపించే సెట్.. ఇలా అన్నీ కలిసి పాటలో ఎమోషన్ ను ఛండాలం చేసింది.

ఓవరాల్ గా పాటపై సరిగ్గా వర్కవుట్ చేయలేదనే విషయం స్క్రీన్ పై చూస్తే అర్థమైపోతుంది. వాస్తవానికి మొదట ఫిమేల్ వాయిస్ లో పాడిన పాట ..తర్వాత మేల్ వాయిస్ లో మార్చి గందరగోళం చేశారని టాక్ వినిపిస్తుంది.

‘అరవింద సమేత’లో అన్యాయం జరిగిందా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share