బాహుబలి దెబ్బకి వాళ్ళ రికార్డ్స్ గల్లంతు

బాహుబలి కలెక్షన్స్ జాతర మొదలైంది, ఈ జాతర ఆలా ఇలా కాదు బాలీవుడ్ లో బడా హీరో ల పేరు మీద ఉన్న రికార్డ్స్ని సైతం ఊది పడేసింది. ప్రపంచ వ్యాప్తంగా 9000 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం మొదటి రోజు తెలుగు, తమిళ, కనడ, మలయాళం మరియు హిందీ బాషలలో 100 కోట్లు పైగానే కలెక్ట్ చేసిందట. ఇక బాలీవుడ్ లో ఏకంగా 50 కోట్లు కొల్ల గొట్టింది, ఇప్పటి వరుకు బాలీవూడ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్లో టాప్ లో ఉన్న సల్మాన్ ఖాన్ సుల్తాన్ 36 కోట్లు అలాగే అమీర్ ఖాన్ సినిమా దంగల్ 29.50 కోట్లు పేరు మీద ఉన్న రికార్డ్స్ని బాహుబలి 2 తొక్కిపడేసింది.

ఇది కేవలం నాన్ హాలీడే రికార్డు అంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది అదే శనివారం కానీ ఆదివారం రిలీజ్ అయివుంటే ఇంకెంత కొల్ల గొట్టేదో. ట్రేడ్ అనలిస్టుల లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి వారం 400 కోట్లు మార్క్ ని రీచ్ చేయవచ్చు అని అంటున్నారు. ఆ మార్క్ గాని దాటితే బాలీవుడ్ హీరోలు  నానా కష్టాలు పడిన ఆ రికార్డుని చేరుకోలేరేమో. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తెలుగులో మొదటి రోజు 45 కోట్లు వరకు కొల్లగొట్టింది, తమిళనాడు మొదటి షో రద్దు కారణంగా అక్కడ 13 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక కేరళలో 5 కోట్లు వరకు వచ్చాయి. ఇక మును ముంది ఈ బాహుబలి ఇంకెన్ని రికార్డ్స్ తన కాతాలో వేసుకుంటాడో చూదాం.