దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి తన జర్నీలో ఓ మైలురాయిని చేరేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనాలున్న బాహుబలి 2 ఇప్పటి వరకు రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. తొలి 5 రోజులకు బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 367 కోట్ల షేర్, రూ. 700 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఈ సినిమా ఏపీలో 54.4 కోట్లు – సీడెడ్‌లో 17.4 కోట్లు – నైజాంలో 28.4 కోట్టుతో మొత్తం ఏపీ+తెలంగాణలో 100.24 కోట్ల షేర్ రాబట్టింది. కర్నాటక 25.5 కోట్లు – తమిళ నాడు 28.47 కోట్లు – కేరళ 13.03 కోట్లు రాబడితే దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి రూ. 110 కోట్లు కొల్లగొట్టింది.
ఇక యూఎస్ఏ నుంచి 51.48 కోట్ల షేర్ రాబట్టిన బాహుబలి, రెస్టాఫ్ ది వరల్డ్‌లో 38.7 కోట్లు కలుపుకుని ఓవరాల్‌గా 367.42 కోట్లు కొల్లగొట్టింది. ఇక 703.40 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. బాహుబలి ముందు ఇప్పుడు అమీర్‌ఖాన్ పీకే రికార్డు ఒక్కటే మిగిలి ఉంది.