వ‌సూళ్ల‌లోనూ బాహుబ‌లే!!

ప్ర‌పంచాన్ని త‌న మాయాజాలంతో అల్లాడిస్తున్న బాహుబ‌లి-2 మూవీ అనుకున్న అంచ‌నాల‌ను దాటి శ‌ర‌వేగంగా ముందుకు పోతోంది. స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మంత్ర‌ముగ్థుడిని చేయ‌డంతోపాటు.. ఆల్‌టైం రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీ అటు హిందీలోనూ ఇటు ప్రాంతీయ భాష‌ల్లోనూ సాధ్యం కాని విధంగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ప‌ట్టుమ‌ని 17 రోజుల్లో మొత్తంగా 1340 కోట్లు వ‌సూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది. దీంతో అటు బాలీవుడ్ స‌హా అన్ని వ‌ర్గాల మూవీ మేధావులు నోరెళ్ల బెడుతున్నారు.

17 రోజుల నుండి నిర్విరామంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తున్న బాహుబలి 2.. ఏకంగా 1340 కోట్ల గ్రాస్.. అంటే షుమారుగా 668+ కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 170 కోట్ల షేర్ (255 కోట్ల గ్రాస్) వసూలు చేయగా.. కర్ణాటక నుండి 44 కోట్లు (95 గ్రాస్).. తమిళనాడు నుండి 56 కోట్లు (106 కోట్ల గ్రాస్).. కేరళ నుండి 24 కోట్లు (53 కోట్ల గ్రాస్).. తక్కిన భారతదేశం నుండి 238 కోట్ల షేర్ (605 కోట్ల గ్రాస్) వసూలు చేసిందీ సినిమా. ఇక అమెరికాలో 80 కోట్ల షేర్ (124 కోట్ల గ్రాస్).. తక్కిన వరల్డ్ బాక్సాఫీస్ నుండి 53+ కోట్ల షేర్ (100 కోట్ల షుమారు గ్రాస్) వసూలు చేసి.. మొత్తంగా 668+ కోట్ల షేర్ రాబట్టింది. అంటే ఆల్రెడీ 1340 కోట్ల గ్రాస్ వచ్చేసింది కాబట్టి.. 4వ వారం పూర్తయ్యే సరికి.. 1500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టే ఛాన్సుంది.

ఇప్పటికే భారతదేశంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్.. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ తెలుగు హిట్.. తమిళనాడు అండ్ కేరళ కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది బాహుబలి 2. ఇప్పటివరకు 800 కోట్లు దాటి వసూలు చేసి తొలి ఇండియిన ఫిలిం బాహుబలి 2 అనే చెప్పాలి. సింప్లీ.. సాహో రాజమౌళి!!!