
ఇటీవల క్రేజీ సినిమాలు రిలీజ్కు ముందే పలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా భారీ అంచనాలతో తెరకెక్కిన సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ సినిమా సైతం రిలీజ్కు ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే పద్మావత్ బాహుబలి వసూళ్లను టచ్ చేస్తుందా ? లేదా క్రాస్ చేస్తుందా ? అన్నదాని మీద కూడా రకరకాల చర్చలు నడిచాయి. కొంతమంది ట్రేడ్ ఎనలిస్టులు అయితే పద్మావత్కు వచ్చిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని కూడా లెక్కలు వేశారు.
ఇక వాస్తవంగా చూస్తే పద్మావత్ బాహుబలి 2 దరిదాపులలోకి కూడా వెళ్ళలేకపోయింది. కర్ణి సేన వ్యతిరేకత మూలంగా కొన్ని ముఖ్య కేంద్రాల్లో విడుదల ఆలస్యం కావడం, కొన్ని రాష్ట్రాల్లో తొలి రెండు రోజులు షోలు పడకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వసూళ్లు చూస్తే బాహుబలి 2ని టచ్ చేసే సాహసం చేయలేకపోయింది. చారిత్రక కథాంశం అయినా బన్సాలీ ఎమోషన్ల మీదే ఎక్కువుగా కాన్సంట్రేషన్ చేయడం, గ్రాఫిక్స్, వార్ సీక్వెల్స్ తేలిపోవడంతో జనాలకు బాహుబలి 2 ఎక్కిన రేంజ్లో పద్మావత్ ఎక్కలేదు.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే పద్మావత్ తొలి 10 రోజులకు 192.2 కోట్లు రాబట్టగా బాహుబలి 2 ఒక్క హింది వెర్షన్ నుంచే పది రోజులకు గాను 327.25 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే బాహుబలి 2 దరిదాపుల్లోకి కూడా పద్మావత్ రాలేదు. రన్వీర్ సింగ్ – షాహిద్ కపూర్ – దీపికా పదుకునే లాంటి స్టార్లు రాజమౌళి కంటే ఎక్కువ దర్శకత్వ అనుభవం ఉన్న సంజయ్ లీలా భన్సాలీ లాంటి స్టార్లు ఉన్నా బాహుబలి 2 ఫిగర్ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయింది.
ఇక సల్మాన్ బాహుబలిని దాటేందుకు రెండుసార్లు ట్రై చేసి ఫెయిల్ అవ్వగా, అమీర్ దంగల్ మాత్రం చైనా వసూళ్లతో కలుపుకుంటేనే బాహుబలి 2 వసూళ్లను దాటింది. ఏదేమైనా మన రాజమౌళి దర్శకత్వం ప్రతిభకు బాహుబలి 2 ఏ రేంజ్లో నిదర్శనంగా నిలిచిందో దీనిని బట్టే అర్థమవుతోంది.