బాహుబ‌లి వ‌ర‌ల్డ్ వైడ్ క్రేజ్ ఉహ‌కే అంద‌ట్లేదుగా….

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ సినిమాపై వ‌స్తోన్న క్రేజ్ ఊహ‌కే అంద‌ట్లేదు. స్కైను ట‌చ్ చేసే రేంజ్ క్రేజ్‌తో బాహుబ‌లి దూసుకుపోతోంది. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న బాహుబ‌లి 2 ఈ నెల 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిందంటే ఓ తెలుగు సినిమాకు ఎలాంటి ఘ‌న‌త ద‌క్కిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎన్ని స్క్రీన్ల‌లో రిలీజ్ అవుతుందో ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. నిన్న‌టికి నిన్న ఈ సినిమాకు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 7500 స్క్రీన్లు కేటాయించార‌ని టాక్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు కేవ‌లం ఇండియాలోనే 6500 స్క్రీన్ల‌లో బాహుబ‌లి రిలీజ్ అవుతోంది. ఒక్క తెలుగు వెర్ష‌న్‌లో ఏపీ+తెలంగాణ‌లో అన్ని థియేట‌ర్ల‌లోను సుమారుగా 1800 స్క్రీన్ల‌లో బాహుబ‌లి ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

మ‌రో షాక్ ఏంటంటే దేశం కాని దేశం అమెరికాలోనూ ఈ చిత్రంపై అనూహ్యమైన అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా మార్కెట్‌కు కొంగు బంగారం అయిన అమెరికా+కెన‌డాలో 1005 స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. చాలా హాలీవుడ్ సినిమాలు సైతం ఈ రేంజ్‌లో రిలీజ్ కావు. పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల కంటే గొప్ప‌గా ఈ రేంజ్‌లో అక్క‌డ బాహుబ‌లి రిలీజ్ అవుతుండ‌డం ఓవ‌ర్సీస్ వ‌ర్గాల‌ను సైతం షాక్‌కు గురి చేస్తోంది.

ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది ఈ సినిమా గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్ర‌భాస్ ఈ సినిమాలో మూడు రోల్స్‌లో క‌నిపిస్తాడ‌ట‌. శివుడు, అమరేంద్ర బాహుబలి పాత్రలతో పాటు మహేంద్ర బాహుబలి అనే మరో పాత్రలోనూ క‌నిపిస్తాడ‌న్న వార్త‌లు సినిమాపై హైప్‌ను మ‌రింత‌గా పెంచుతున్నాయి.