బాహుబలి టికెట్స్ కావాలా నాయనా..!

ఏ నాయనా లడ్డు కావాలా..ఏ నాయనా మరో లడ్డు కావాలా అన్న యాడ్ గుర్తుండేవుంటుంది..అలా మరో లడ్డు వద్దు కానీ ఒక్క లడ్డు అయినా సరే అదేనండి బాహుబలి టికెట్స్ ఇస్తే బావుండనిపిస్తోంది.ఎక్కడ చూసినా బాహుబలి మేనియానే.ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ ..బాహుబలి టికెట్ దొరికిందా అని.సిక్కిం బంపర్ లాటరి కి ఎంత క్రేజ్ ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం బాహుబలి టికెట్స్ కి అంతకంటే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది.

ముల్టీప్లెక్సల వద్ద అప్పుడే క్యూలు..తొక్కిసలాటలు..పొలిసు బందోబస్త్ లు కనిపిస్తున్నాయి.అప్పుడెప్పుడో తొంబయిల్లో సినిమాలకి ఇలా క్యూ లు తోపులాటలు చూసాం ఆతరువాత మల్లి ఇదేనేమో.పెద్ద..చిన్న..ముసలి..ముతకా..అందరి నోటా ఒకటే మాట..బాహుబలి.బాహుబలి…ఇంతవరకు బాగానే వున్నా టికెట్స్ దగ్గరికొచ్చేసరికే అంత వీజీ కాదు సినిమా చూడటం అని అర్థం అవుతోంది.ఎక్కడ చూసినా హౌసుఫుల్ బోర్డు లే..ఏ సైట్ చూసినా సోల్డ్ అవుట్ మెసెజ్ లే.పైరవీలు,రెకమండేషన్లు..పాత పరిచయాలు..ఎదో ఒకటి వెతి పట్టుకుని టికెట్ ఎలాగైనా సాధించాలి.ఇదే ప్రతి ఒక్కరి ప్రయత్నమూ.టికెట్ దొరికితే ఎవరెస్ట్ ఎక్కిసినత ఆనందంతో గెంతులేస్తున్నారు సినీ జనాలు.

ఇలా టికెట్స్ కరువు అంటే అదేదో అరకొర థియేటర్స్ లో రిలీజ్ కాదు సుమీ..ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 9 వేల స్క్రీన్ లపై రేపు రాత్రినుంచే శివతాండవం చేయబోతున్నాడు బాహుబలి.తెలుగు రాష్ట్రాల్లో ఐదు,ఆరు షోలకి ఇప్పటికే అనుమతినిచ్చారు.అంటే రోజుకి దాదాపుగా 50 వేల షో లు 24 గంటలు గడవకముందే పడనున్నాయి.ఇది ఒక ప్రళయం.అయినా సరే టికెట్స్ కు కరువొచ్చింది.షో కి దాదాపు గా ఓ 300 మంది చొప్పున లెక్క వేసినా మొదటి 24  గంటల్లోనే దదాయపుగా ఒక కోటి యాభై లక్షలమంది సినిమా చూసేయబోతున్నారన్నమాట.అయినా సరే సామాన్యుడికి టికెట్స్ కరువే.అదే బాహుబలి మేనియా అంటే.