బాలయ్య 101 పూరీతోనే….

February 23, 2017 at 6:49 am
Balakrishna-101-puri-jagannadh

నటసింహం బాలకృష్ణ 100 వ.సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పటినుంచి బాలయ్య 101 వ సినిమాగురించి రోజుకొక న్యూస్ వస్తూనే వుంది.మొదట కృష్ణ వంశి తో రైతు సినిమా అనుకున్నారని, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా అని పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందని ఆదిత్య 999 అని రకరకాల న్యూస్ వచ్చింది. అయితే వీటిలో ఏది ఫైనల్ అవ్వలేదు.

అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్య 101 వ సినిమా పూరి జగన్నాద్ తో ఫిక్స్ అయ్యిందని. అది కూడా రేపు శివరాత్రి సందర్భంగా అనౌన్స్ చేస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాకోసం టైటిల్ నుంచి స్క్రిప్ట్, డైలాగ్స్, నేరేషన్ అన్ని పూరీనే తయారు చేసుకుంటున్నాడట. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని కచ్చితంగా పూరికి ఇది కంబ్యాక్ సినిమా అవుతుందని స్క్రిప్ట్ విన్నవాళ్ళు చెప్పుకుంటున్నారట.

బాలయ్య 101 పూరీతోనే….
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts