సినిమా ఓకే..కానీ ఆ ప్లాప్ డైరెక్ట‌ర్‌తోనా? 

May 14, 2017 at 1:44 pm

యువ‌రత్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా గురించి ఏ చిన్న విష‌యం తెలిసినా అభిమానుల‌కు పండ‌గే! 100వ సినిమా చారిత్రాత్మ‌క `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి` సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఆయ‌న‌.. 101వ సినిమాను డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. ఈ సినిమా గురించి వీరంతా టెన్ష‌న్ ప‌డుతున్న స‌మ‌యంలోనే మ‌రో షాక్ ఇచ్చాడు బాల‌య్య‌! త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ఎన్నో విజ‌యాలు అందించిన ద‌ర్శ‌కుడితో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కానీ ఇది విని సంతోష‌ప‌డాలో.. లేక కంగారుప‌డాలో తెలియ‌డంలేద‌ట అభిమానుల‌కు. బాల‌య్య వ‌రుస‌గా రాంగ్ డెసిష‌న్స్ తీసుకుంటున్నాడ‌ని భావిస్తున్నార‌ట‌.

100వ సినిమా గౌతమీ పుత్ర శాత‌క‌ర్ణి సినిమా ద్వారా త‌న స్టామినా మ‌రోసారి నిరూపించాడు బాల‌య్య‌! రాజుగా రాజ‌సాన్ని వొలికించి అభిమానులనే కాక అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. 101వ సినిమా ఎవ‌రితో చేస్తాడ‌ని అనుకోగానే.. కృష్ణ‌వంశీ వంటి డైరెక్ట‌ర్ల పేర్లు వినిపించినా.. వారంద‌రినీ కాద‌ని పూరీ జ‌గ‌న్నాథ్‌కు అవ‌కాశ‌మిచ్చాడు. దీంతో ఆయ‌న‌ ఫాన్స్ తెగ అనుమానంతో రగిలి పోతున్నారు. స్టార్ యూత్ హీరోలంతా మొహం చాటేసిన స‌మ‌యంలో బాలయ్య మాత్రం పూరీని అక్కున చేర్చుకున్నాడు. కాని పూరి మాత్రం తన రెగ్యులర్ స్టైల్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే సినిమా తీసేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌!

తన సినిమా గురించి ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి తర్వాత తుస్సుమనిపించడం పూరి కి చాలా కామన్ గా మారిపోయింది. ఇప్పుడు బాలయ్య సినిమాను కూడా యమా ఫాస్ట్ గా తీస్తున్నాడు జగ్గు. ఇలా 101 టెన్షన్ ఉండగానే 102 కూడా ఓకే చేశాడు బాలకృష్ణ. అది కూడా ఫుల్ ఫాం లో ఉన్న డైరెక్టర్ తో కాదు. తమిళ్ లో ఒకప్పుడు అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి ఈ మధ్య తన స్టాండర్డ్ కు తగ్గ సినిమాలు తీయలేక బాడ్ పీరియడ్ లో ఉన్న కె.ఎస్. రవి కుమార్ తో. ప్రముఖ నిర్మాత కల్యాణ్ దీన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. రవి కుమార్ అప్పట్లో రజనికాంత్ తో నరసింహ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు కాని ఈ మధ్య కాలంలో ఆయనది ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు.

ఈ మధ్య కన్నడ లో సుదీప్ తో కొటిగోబ్బ 2 అనే సినిమా చేస్తే అది అనుకున్నంత ఆడలేదు. ఇప్పుడు బాలయ్య తో ఓకే చేయించుకున్నాడు. జూలై నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ ఎందరో ఉండగా ఇలా ఫాం పూర్తిగా కోల్పోయిన సీనియర్ డైరెక్టర్స్ తో ఎందుకు చేస్తున్నాడు అని ఫాన్స్ ఒకటే వర్రీ అవుతున్నారు. మరి పూరి,రవి లలో ఒక్కరైనా హిట్ ఇస్తే బాగుండున‌ని కోరుకుంటున్నారు.

సినిమా ఓకే..కానీ ఆ ప్లాప్ డైరెక్ట‌ర్‌తోనా? 
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share