బాలయ్య ముందే చిందులేస్తున్న అఖిల్!

November 8, 2018 at 12:03 pm
Balakrishna, Akhil, Mr Majnu Movie, Release, January, NTR Biopic

అదేమిటోగానీ.. అక్కినేని అఖిల్ క్లిక్ కాలేక‌పోతున్నాడు. తీసిన రెండు సినిమాలూ బోల్తా కొట్ట‌డంతో ఆయ‌న తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. తాజాగా.. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ సినిమాతోనైనా అఖిల్ విజ‌యం అందుకుంటాడా..? అని అక్కినేని ఫ్యామిలీ, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ విష‌యంలో అక్కినేని నాగార్జున కూడా ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. చైతూ లాగే మొద‌టి సినిమాతోనే మాంచి గుర్తింపు పొందాల‌ని చూసినా అఖిల్ సినిమా తుస్సుమంది. ఇక రెండో సినిమా హ‌లో విష‌యంలో నాగార్జున అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. ఫ‌లితం లేకుండా పోయింది.

1541582114-1353

ఇప్పుడు ఇక మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాపైనే అంద‌రి ద‌`ష్టిప‌డుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తి అయింది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులే మిగిలాయి. అయితే.. మొద‌ట ఈ సినిమాను వ‌చ్చే డిసెంబ‌ర్‌లోనే విడ‌దుల చేయాల‌ని అనుకున్నారు. కానీ.. ఇక్క‌డో సెంటిమెంట్ అడ్డొచ్చింది. కానీ ‘హలో’ డిసెంబర్లోనే రిలీజై ఫ్లాప్ అయింది. అంతేగాకుండా.. మిస్ట‌ర్ మ‌జ్ను ఫైన‌ల్ కాపీ చూసి.. నాగార్జున‌ మార్పులు చేర్పులు చేసే అవ‌కాశాలు ఉన్నాయని చిత్ర‌యూనిట్ అంటోంది. ఈ నేప‌థ్యంలో ఇక ఈ సినిమా డిసెంబ‌ర్‌లో విడుద‌ల కావ‌డం క‌ష్టేమే. ఇదే విష‌యం తాజాగా వ‌చ్చిన పోస్ట‌ర్‌లో తెలిసిపోయింది.

ఈ సినిమాను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేస్తామ‌ని ఆ పోస్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. అయితే.. సంక్రాతికి విడుద‌ల అవుతుందంటే.. అది కుదిరేప‌నికాదు. సంక్రాంతికి ప‌లు పెద్ద సినిమాలు వ‌స్తున్నాయి. జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేద్దామంటే.. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ మ‌హానాయ‌కుడు విడుద‌ల కానుంది. అలాగే ఈ తేదీకి మ‌రో రెండు సినిమాలు కూడా విడుద‌ల కానున్నాయి. దీంతో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా విడుద‌ల దాదాపుగా జ‌న‌వ‌రి మొద‌టి వారంలో ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విష‌యంలో కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.

బాలయ్య ముందే చిందులేస్తున్న అఖిల్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share