బాబాయ్ కోసం అబ్బాయ్ ఏం చేస్తాడు..

March 20, 2018 at 10:34 am
Balakrishna , Chief guest, MLA audio function, Kalyan ram, NTR,

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా ఎమెల్యే మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి అడుగు పెట్టనుంది.  2016లో వ‌చ్చిన ఇజం సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న క‌ళ్యాణ్‌రామ్ చేస్తోన్న సినిమా ఇదే. ఉపేంద్ర మాధ‌వ్ అనే కొత్త డైరెక్ట‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌ళ్యాణ్ స‌ర‌స‌న చాలా రోజుల త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. 

 

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేస్తున్నారు. ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌ను కాస్త లేట్‌గా ఈ రోజు హైదరాబాద్ దసపల్లాలో నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు ఎవ‌రు గెస్ట్‌గా వ‌స్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమా కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు. దీంతో ఎన్టీఆర్ వ‌స్తాడా ?  రాడా ? అన్న‌ది డౌటే. వ‌స్తే ఎన్టీఆర్ లుక్ రివీల్ అవుతుంది… త్రివిక్ర‌మ్ కండీష‌న్లు ఎక్కువే ఉంటాయి.

 

ఒక వేళ ఈ ప‌రిధులు దాటి ఎన్టీఆర్ వ‌స్తే అన్ని క‌ళ్లు ఎన్టీమీదే ఉంటాయి. హ‌రికృష్ణ ఎలాగూ వ‌స్తాడు. అయితే నంద‌మూరి ఫ్యాన్స్ మాత్రం బాల‌య్య రావాల‌ని కోరుకుంటున్నారు. హ‌రికృష్ణ ఫ్యామిలీలో ఇలాంటి ఫంక్ష‌న్ల‌కు బాల‌య్య వ‌చ్చి చాలా రోజులు అవుతోంది. పొలిటికల్ టచ్ ఉన్న ఎమెల్యే సినిమా ఫంక్షన్, ఇటు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై పెద్ద ఎత్తున ఫైటింగ్ జ‌రుగుతోంది ?  ఈ టైంలో బాల‌య్య ఈ కార్య‌క్ర‌మానికి ఎంత వ‌ర‌కు వ‌స్తాడ‌న్న‌ది మాత్రం చెప్ప‌లేం.

 

ఎన్టీఆర్‌, బాల‌య్య ఇద్ద‌రూ వ‌స్తే ఈ ఫంక్ష‌న్, సినిమా రేంజ్ మారిపోతాయి. వీరిలో ఎన్టీఆర్ వ‌చ్చినా ఓకే. వీరిద్ద‌రు కూడా డుమ్మా కొట్టేస్తే ఫంక్ష‌న్‌కు క‌ళే ఉండ‌దు. ఇక ఇప్ప‌టికే ఎమ్మెల్యేకు మణిశర్మ ఇచ్చిన ఆల్బ‌మ్ పాపుల‌ర్ అయ్యింది.  పటాస్ తర్వాత హిట్ లేక ఆకలి మీదున్న కళ్యాణ్ రామ్ విజయ కాంక్షను ఎమెల్యే తీరుస్తుందో లేదో మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది

 

బాబాయ్ కోసం అబ్బాయ్ ఏం చేస్తాడు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share