చిన్న‌మ్మ వ‌ర్సెస్ బాల‌య్య‌… బ‌యోపిక్ ర‌గ‌డ‌!

November 1, 2018 at 2:02 pm

చిన్న‌మ్మ‌! నంద‌మూరి ఫ్యామిలీలో అన్న‌గారు ఎన్టీఆర్ కుమార్తె, రాజ‌కీయ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ రిని ఈ ఫ్యామీలీ ముద్దుగా పిలిచే పేరు చిన్న‌మ్మ‌. ఇక‌, హిందూపురం ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ ఉర‌ఫ్ బాల‌య్య‌కు చిన్న‌మ్మ‌కు మ‌ధ్య చాలా బంధ‌మే ఉంది. ఏ విష‌య‌మైనా ఆయ‌న పురందేశ్వ‌రితో పంచుకుంటారు. ఇరువురు వేర్వేరు పా ర్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ.. నిత్యం మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే, తాజాగా త‌మ తండ్రిఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్‌-క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్‌-మ‌హానాయ‌కుడు చిత్రాల విష‌యంలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌వ‌హారం బెడిసికొడుతున్న‌ట్టు తెలుస్తోంది.

Hike-in-Remuneration-for-NTR-Team

ఈ సినిమా తాలూకు వ్య‌వ‌హారంఅంతా.. గ‌డిచిన ఏడాదిగా జ‌రుగుతున్నా.. అప్ప‌ట్లోలేని విభేదాలు తాజాగా ఈ అక్క‌-త మ్ముడి మధ్య చోటు చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. బాల‌య్య ఈ మూవీ మేకింగ్‌కు దిగిన నాటి నుంచి పెద్ద‌గా విభేదాలు లేవు. అయితే, ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో మార్పుల దిశ‌గా బాల‌య్య ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్పుడు ఈ విష‌యం పైనే నంద‌మూరి ఫ్యామిలీలో విభేదాలు చోటు చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌ను హైలెట్ చేయాల‌ని బాల‌య్య నిర్ణ‌యించుకున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం టాలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

పార్టీ ప్రారంభించిన స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చిన ఎన్టీఆర్‌.. త‌ర్వాత పాల‌న‌పై ప‌ట్టుకోల్పోయార‌నే విష‌యాన్ని లీల గా చెప్ప‌డంతోపాటు.. నాదెండ భాస్క‌ర‌రావు ఎపిసోడ్‌ను దీనికి స‌పోర్టుగా తీసుకుంటున్నార‌ని, ఇదే క్ర‌మంలో పార్టీని బ‌తి కించేందుకే చంద్ర‌బాబు టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టార‌నే కోణాన్ని ఈ బ‌యోపిక్‌లో ఉద‌హ‌రించ‌డం ప్ర‌ధాన అంశంగా మార‌నుం ద‌ని అంటున్నారు. ఇప్పుడు ఈ విష‌యాన్ని పురందేశ్వ‌రి ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ను కించ‌ప‌రిచేలా ఆయ‌న బ‌యోపిక్ తీయ‌డాన్ని ఆమె త‌ప్పుప‌డుతున్నారు. ఆ మాత్రానికి బ‌యోపిక్ తీసి ఎవ‌రిని ఉద్ధ‌రిస్తార‌ని కూడా ప్ర‌శ్నించ‌డం మీడియా లో సంచ‌ల‌నంగా మారింది. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే ఈమూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న విష‌యాన్ని కూడా ఆమె చ‌ర్చించారు. దీనిని బ‌ట్టి.. ఎన్టీఆర్ బ‌యోపిక్ వివాదం.. బ‌య‌టి వారికంటే కూడా నంద‌మూరి ఫ్యామిలీలోనే చిచ్చుకు కార‌ణ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

చిన్న‌మ్మ వ‌ర్సెస్ బాల‌య్య‌… బ‌యోపిక్ ర‌గ‌డ‌!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share