క్రిష్ కు బాలయ్య భారీ ఆఫర్

May 18, 2018 at 11:32 am
Balakrishna, Krish, NTR Bio Pic, Director

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ తీస్తార‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్నో సంచ‌ల‌నాలు రేపింది. ఈ బ‌యోపిక్‌పై లెక్కకు మిక్కిలిగా వార్త‌లు వ‌చ్చాయి. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడి చేతుల మీదుగా కూడా ఈ బ‌యోపిక్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు ముందుగా తేజ ద‌ర్శ‌కుడు అని ఫిక్స్ చేశారు. త‌ర్వాత తేజ ప‌నితీరు విష‌యంలో బాల‌య్య సంతృప్తిగా లేక‌పోవ‌డంతో స్క్రిఫ్ట్ కూడా అంత స‌రిగా లేద‌ని బాల‌య్య భావించ‌డం, ఇదే టైంలో తేజ మ‌రో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌తో కూడా సినిమా చేయాల‌నుకోవ‌డం ఇలా అనేక కార‌ణాలు ఈ క‌థ‌కు తేజ న్యాయం చేయ‌లేడ‌ని బాల‌య్య భావించిన‌ట్టు తెలుస్తోంది. చివ‌ర‌కు బాల‌య్య – తేజ మ‌ధ్య అంత కోఆర్డినేష‌న్ లేక‌పోవ‌డంతో ఈ బ‌యోపిక్ నుంచి తేజ త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు.

 

తేజ త‌ప్పుకున్నాక బాల‌య్యే స్వ‌యంగా ఈ బ‌యోపిక్‌ను డైరెక్ట్ చేస్తార‌ని, చంద్ర సిద్ధార్థ్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తార‌ని మ‌రో వార్త వ‌చ్చింది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం బాల‌య్య ఈ బ‌యోపిక్‌ను తానే డైరెక్ట్ చేయ‌డం అంత క‌రెక్ట్ కాద‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రో తేలిపోయింది. బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా డైరెక్ట్ చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన క్రిష్ ఈ బ‌యోపిక్ డైరెక్ట‌ర్ అని ఫిక్స్ చేశార‌ట‌.

 

అయితే ముందుగా ఈ బ‌యోపిక్‌లో బాల‌య్య న‌టించ‌డు. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మాతగా ఒక సాంఘిక చిత్రం మునుముందుగా ఈ నెల చివరి వారంలో మొదలై పోతుంది. ఆ వెనువెంటనే సినిమా బయోపిక్‌ షూటింగ్‌ సాగుతుందని సమాచారం. క్రిష్ వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో సినిమాలు తీసి హిట్‌కొట్టాడు. రెండోప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో తీసిన కంచె, శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తీసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాల‌కు మంచి పేరు కూడా వ‌చ్చింది.

 

క్రిష్ ప్ర‌స్తుతం కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇలా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో సినిమాలు తీస్తోన్న క్రిష్ అయితేనే ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను బాగా తెర‌కెక్కిస్తార‌ని డిసైడ్ అయిన బాల‌య్య ఇప్పుడు ఈ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న‌కే అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు మ‌హాన‌టి సినిమా ప్ర‌భంజనం క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ తేడాకొడితే అభాసుపాలు కావాల్సి వ‌స్తుంది. అందుకే కాస్త లేట్ అయినా సినిమా బాగా రావాల‌ని బాల‌య్య ముందుగా వినాయ‌క్ సినిమాలో న‌టించాకే బ‌యోపిక్‌ను ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

 

క్రిష్ కు బాలయ్య భారీ ఆఫర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share