బాలయ్య పిలుపు… అంతా జూనియర్ దే!

September 10, 2018 at 12:31 pm

ఎన్టీఆర్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాపై ఇప్ప‌టి నుంచి అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఇదే స‌మ‌యంలో ఓ విష‌యం తెగ క్ర‌ష్ అవుతోంది. అదేమిటంటే.. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌కు నంద‌మూరి బాల‌క‌`ష్ణ వ‌స్తున్నారా..? లేదా..? అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌టో చ‌ర్చ‌. ఇప్ప‌టికీ ఇంకా ఆడియో రిలీజ్ తేదీనే ప‌క్కాగా ఫైన‌ల్ కాలేదు. కానీ.. ఒకే వేదిక‌పై అబ్బాయ్‌- బాబాయ్ క‌నిపిస్తారా..? లేదా..? అన్న దానిపై అనేక ఊహాగానాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ చిన్న విష‌యాన్ని ఇలా భూత‌ద్దంలో చూడాలా..? అనేగా మీ డౌటు. నిజమే మ‌రి. ఎందుకంటే.. బాబాయ్‌- అబ్బాయ్ రిలేష‌న్ లో పెద్ద గ్యాప్ రావ‌డం.. ప్ర‌స్తుతం ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసిపోవ‌డంతో అభిమానుల్లో ఒకింత ఆస‌క్తిపెరిగింది.

TEASER--NTR-s-Aravinda-Sametha-Veera-Raghava-1534306093-1910

ఇక ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎన్టీఆర్ తండ్రి నంద‌మూరి హ‌రిక‌`ష్ణ దుర్మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. దీంతో దాదాపుగా ప‌దిప‌న్నెండు రోజులుగా బాబాయ్‌- అబ్బాయ్ క‌లిసే ఉంటున్నారు. ఆ విషాదం నుంచి తేరుకుని ఇక ఎవ‌రి సిన‌మాల్లో వారు బిజీగా ఉంటున్నారు. జూనియ‌ర్ న‌టిస్తున్న అర‌వింద స‌మేత సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తి అయింద‌నే టాక్ వినిపిస్తోంది. ఈనెల 20వ తేదీన సినిమా ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే ఈ ఫంక్ష‌న్‌కు బాల‌య్య బాబు వ‌స్తున్నార‌నే టాక్ చాలా రోజులుగా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. మ‌రోవైపు నంద‌మూరి బాల‌క‌`ష్ణ కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కూడా శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది.

balakrishna-and-jr-ntr_b_1806181023

అయితే.. అర‌వింద స‌మేత ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్‌కు సంబంధించి, ఇవ్వాలో రేపో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మాత్రం ఫైన‌ల్ డిసిష‌న్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌దేన‌నీ.. త‌మ‌కు ఎలాంటి ఒపీనియ‌న్ లేద‌ని నిర్మాత‌ల‌యిన హారిక హాసిని సంస్థ అంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో బాబాయ్ బాల‌య్య షెడ్యూల్ తెలుసుకోమ్మ‌ని ఎన్టీఆర్ త‌న స‌న్నిహితుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అర‌వింద స‌మేత ఆడియోఫంక్ష‌న్ తేదీ నాటికి బాబాయ్ ఎక్క‌డ ఉంటారు..? వీల‌వుతుందా..? లేదా..? ఒక‌వేళ‌.. బాబాయ్‌కు అనుకూలంగా ఉండే డేట్‌నే ఫిక్స్ చేద్దామా..? అన్న కోణంలో ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో బాల‌య్య బాబు వ‌స్తే.. ఇక అభిమానుల‌కు పండుగేన‌నే టాక్ వినిపిస్తోంది. ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డాలంటే.. మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.

BALAKRISHNA-922x768

బాలయ్య పిలుపు… అంతా జూనియర్ దే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share