బాలయ్య టాప్ గేర్…మరి చరణ్!

September 15, 2018 at 11:52 am

టాలీవుడ్ లో ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాలో చిట్టిబాబు గా రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. అంతే కాదు ఈ సినిమా చెర్రీ కెరీర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది..రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. అయితే రాంచరణ్ తర్వాత సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాంచరణ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది..అంతా బాగుంది కానీ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ ఎలాంటివి కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.

Dm8mLwwU4AA7nqi

చిరంజీవి పుట్టిన రోజు అనుకున్నారు..ఫస్ట్ లుక్ రాలేదు..పోనీ బాబాయి పవన్ కళ్యాన్ పుట్టిన రోజు అనుకున్నారు…అప్పుడు కూడా రాలేదు..పోనీ వినాయక చవితి పుట్టిన రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని భావించారు..కానీ అదీ జరగలేదు. దాంతో అసలు చెర్రీ సినిమా సంక్రాంతికి ఉందా లేదా అన్న అనుమానాలు అభిమానుల్లో వస్తున్నాయి..మరోవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు.

kmgal15164422781

ఇక టీజర్ రెడీ చేసి రిలీజ్ చేస్తే..సినిమా ఎక్కడా పెండింగ్ పెట్టే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాల్లో ‘ఎన్టీఆర్‌’కి ఫుల్‌ హైప్‌ వచ్చేస్తే, అదే సమయంలో రిలీజ్‌ కానున్న రామ్‌ చరణ్‌ – బోయపాటి శ్రీను సినిమాకి ఇంతవరకు టైటిల్‌ కూడా డిసైడ్‌ చేయలేదు.గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో కూడా క్రిష్‌ ఇలా చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. అసలే మొదటి వారాంతంలో వచ్చే వసూళ్లే ఒక సినిమా జయాపజయాలని శాసిస్తోన్న ట్రెండ్‌లో విడుదలకి ముందే చూడాలనే కుతూహలం కలిగించడంలో సక్సెస్ సాధిస్తే..ఇక కలెక్షన్ల విషయంలో అనుమానాలే ఉండవు. ఎన్టీఆర్‌ కథ తెలుసుకోవాలనే కోరిక చాలా మందిలో వుంటుంది. అన్ని రకాలుగా ఈ సినిమా సక్సెస్ సాధించే విషయంలో అకుంఠిత దీక్షలో ఉన్నారు దర్శకులు క్రిష్.

బాలయ్య టాప్ గేర్…మరి చరణ్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share