బాల‌య్య 101వ సినిమా ఫిక్స్‌.. టైటిల్స్ కూడా రెడీ

February 22, 2017 at 10:25 am
NBK

త‌న 100వ సినిమా `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి`తో తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఒక పేజీని చిర‌స్థాయిగా నిలుపుకున్న నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌.. త‌దుప‌రి సినిమాపై ఇప్ప‌టివ‌ర‌కూ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఆయ‌న అభిమానుల‌కు శుభ‌వార్త‌!! ఆయ‌న 101 సినిమా దాదాపు ఖ‌రారైనట్లు స‌మాచారం! ముఖ్యంగా ఈ సినిమా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించినా.. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో కృష్ణ‌వంశీ స్థానంలో త‌మిళ ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్ తెర‌పైకి వ‌చ్చాడు. బాల‌య్య కూడా ఈ క‌థ‌కు ఓకే చెప్పాడ‌ట‌. అంతేగాక ఈ సినిమాకి రెడ్డిగారు, జ‌య‌సింహ అనే రెండు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ కూడా రెడీ అయిపోయాయ‌ట‌. వీటిలో ఏదో ఒక‌టి సినిమాకి ఫిక్స్ చేస్తార‌ని తెలుస్తోంది.

ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో పాటు.. అంతే పవ‌ర్ ఫుల్ టైటిల్స్‌కు బాల‌య్య సినిమాలు పెట్టింది పేరన్న విష‌యం తెలిసిందే! శాత‌క‌ర్ణి త‌ర్వాత బాల‌య్య చాలా క‌థ‌లే విన్నాడు. దాదాపు అర‌డ‌జ‌ను మంద క‌థ‌లు ప‌ట్టుకొని రెడీగా ఉన్నా, బాల‌య్య మాత్రం త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్ ర‌వికుమార్‌కి అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ర‌వికుమార్‌తో రెండు మూడు ద‌ఫాల సిట్టింగులు వేశాడ‌ట బాల‌య్య‌. చివ‌రి సిట్టింగ్‌లో క‌థ ఓకే అయిపోయింద‌ని టాక్‌. ఇక బాల‌య్య కాల్షీట్లు ఇవ్వ‌డ‌మే బాకీ అని, షెడ్యూల్స్ వేసుకొని రంగంలోకి దిగిపోవ‌డం త‌రువాయి అని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం రెండు టైటిళ్లు అట్టి పెట్టుకొన్నారట. రెడ్డిగారు, జ‌య‌సింహా అనే టైటిళ్ల‌లో ఏదో ఒక‌టి ఖాయం చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. రెడ్డి, సింహా.. రెండూ బాల‌య్య‌కు అచ్చొచ్చిన టైటిళ్లే. `స‌మ‌ర‌సింహారెడ్డి` బాల‌య్య కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా. చెన్న‌కేశ‌వ రెడ్డి కూడా బాగానే ఆడింది. ఇక `సింహా` సెంటిమెంట్ గురించి చెప్ప‌క్క‌ర్లేద్దు. ల‌క్ష్మీ న‌ర‌సింహా, సింహా, న‌ర‌సింహ‌నాయుడు ఇలా దాదాపుగా `సింహా` పేరు వాడిన‌ప్పుడ‌ల్లా బాల‌య్య బాక్సాఫీసు వ‌ద్ద గ‌ర్జించాడు. మ‌రి ఈసినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో వేచిచూడాల్సిందే!

 

బాల‌య్య 101వ సినిమా ఫిక్స్‌.. టైటిల్స్ కూడా రెడీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share