బాల‌య్య 102కు సెంటిమెంట్ టైటిల్ ఫిక్స్‌

యువ‌ర‌త్న‌, నంద‌మూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోన్న ఈ సినిమా టైటిల్ ఫిక్స‌యిపోయింది. ముందునుంచి ఈ సినిమాకు క‌ర్ణ అనే టైటిల్ ఫిక్స‌యిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ టైటిల్‌పై బాల‌య్య ఫ్యాన్స్ నుంచి అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదు.

ఎట్ట‌కేల‌కు ఈ ప్రాజెక్టుకు ఎట్ట‌కేల‌కు టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా, బాల‌య్యకు సెంటిమెంట్ క‌లిసొచ్చేలా ఈ సినిమా టైటిల్ పెట్టారు. బాలయ్య 102వ సినిమా టైటిల్‌గా ‘జైసింహా’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘జయసింహ’ అనే టైటిల్‌తో సీనియర్ ఎన్టీఆర్ 1955లో ఓ సినిమా చేశారు. సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు బాల‌య్య సినిమాకు జైసింహా అనే టైటిల్ పెట్టారు. బాల‌య్య‌కు సింహా టైటిల్ ఎలాంటి సెంటిమెంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఇటీవ‌ల ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌తో హిట్ కొట్టాడు. ఇటీవ‌ల‌ నంద‌మూరి ఫ్యామిలీకి క‌లిసొచ్చిన జై, బాల‌య్యుక క‌లిసొచ్చిన సింహ‌, గ‌తంలో ఎన్టీఆర్ చేసిన హిట్ సినిమా టైటిల్ ఇలా అన్ని ఈ సినిమా టైటిల్‌కు క‌లిసొచ్చాయి. ఈ టైటిల్ ఎనౌన్స్ అయిన వెంట‌నే నంద‌మూరి, బాల‌య్య అభిమానులు మ‌రోసారి సింహాగా మా హీరో రెచ్చిపోతాడ‌ని సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాను 12 జనవరి 2018న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.