సింగ‌పూర్‌లో బాలయ్య వారసుడు..దాని కోసమేనా!

July 4, 2018 at 11:18 am
Balakrishna's Son, Mokshagna, at Singapore, for six pack body, tollywood entry

నంద‌మూరి మోక్షజ్ఞ‌. బాల‌య్య వార‌సుడిగా రంగ ప్ర‌వేశం చేయ‌నున్న నంద‌మూరి అందగాడు. ఇటీవ‌ల కాలం వ‌ర‌కు ఆయ‌న ఫిలింన‌గ‌ర్‌లోనే చ‌క్క‌ర్లు కొట్టినా.. ఇప్పుడు మాత్రం ఆయ‌న సింగ‌పూర్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే మోక్ష‌జ్ఞ‌ను పెట్టి సినిమాను ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య.. మోక్ష‌జ్ఞ‌ను సింగ‌పూర్‌కు పంపార‌ని తెలుస్తోంది. కొన్నాళ్ల‌ క్రిందటి వరకు తరచు ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే ఓ కేఫ్ కు మిత్రులతో వచ్చి, కాస్సేపు కూర్చుని వెళ్లిన మోక్షజ్ఞ ఇప్పుడు రావడంలేదు. కుదిరితే ఈ ఏడాదిలోనే మోక్ష‌జ్ఞ‌తో ఓ మూవీని తెర‌కెక్కించాల‌ని బాల‌య్య ప‌క్కా వ్యూహంతో ఉన్నారు.

అయితే, ఇంత‌లోనే తాను చేప‌ట్టిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో యువ రామారావుగా మోక్ష‌జ్ఞ‌కు చాన్స్ ఇద్దామ‌ని తాజాగా ఈ మూవీ బాధ్య‌త‌లు నెత్తికెత్తుకున్న ద‌ర్శ‌కుడు కృష్ ప్ర‌పోజ్ చేసిన‌ట్టు తెలిసింది. దీంతో బాల‌య్య వెంట‌నే మోక్ష‌జ్ఞ‌ను సింగ‌పూర్ పంపార‌ని తెలుస్తోంది. అక్క‌డైతే.. సినిమా ప‌రంగా బాడీ ఫిట్‌నెస్‌తోపాటు.. వివిధ ర‌కాలుగా ట్రైనింగ్ అయ్యేందుకు చాన్స్ ఉంద‌ని స‌మాచారం. తెలుగు ఇండస్ట్రీని సిక్స్ ప్యాక్ బాడీ ఊపేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, మోక్షజ్ఞ ఫిజిక్ కాస్త లావుగా ఉంద‌ని, అందుకే ఇప్పుడు పూర్తిగా ఫిట్ నెస్ సంతరించుకునేందుకు, అదే సమయంలో వివిధ సినిమాటిక్ విద్యలు నేర్చుకునేందుకు మోక్షజ్ఞను సింగపూర్ పంపించారని తెలుస్తోంది.

మొత్తంగా ఈ స‌మాచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఫిలింన‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త్వ‌ర‌లోనే బాల‌య్య మూవీని ప్రారంభించే అవ‌కాశం ఉండ‌డం, లేదా ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైఅంచ‌నాలు పెరుగుతున్న నేప‌థ్యంలో మోక్ష‌జ్ఞ ఎంట్రీపైనా అదే రేంజ్‌లో చ‌ర్చ సాగుతోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోనే ఎంట్రీ ఇవ్వ‌డం ద్వారా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా త్వ‌ర‌గా చేరుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. లేదు. స్వ‌యంగా హీరోగానే రంగంలోకి దిగాలంటే.. కూడా క‌థ కూడా రెడీ అవుతోంద‌ని స‌మాచారం. మొత్తంగా మోక్ష‌జ్ఞ ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుంద‌నిఅంటున్నాయి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు.

సింగ‌పూర్‌లో బాలయ్య వారసుడు..దాని కోసమేనా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share