యువరత్న నందమూరి బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూల్ స్టంపర్ వచ్చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కొత్తగా స్టంపర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచే ఈ స్టంపర్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. టీజర్‌కు కాస్త ఎక్కువుగా ట్రైలర్‌కు కాస్త తక్కువుగా ఉండేలా డిజైన్ చేసి వదిలిందే ఈ స్టంపర్.
1.30 నిమిషాల పాటు ఉన్న స్టంపర్ మొత్తం బాలయ్య స్టైల్ యాక్షన్‌తో నిండిపోయింది. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అని బాలయ్య అడగడం ఆ వెంటనే విలన్ ఇది సినిమా కాదురా అని చెప్పగా ఆ వెంటనే బాలయ్య ఇది సినిమా కాకపోతే ఇంకేంటి అని కౌంటర్ వేయడంతో స్టంపర్ స్టార్ట్ అవుతుంది.
ఇక బాలయ్య ఐ యాద్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్.. ఐమాయ్ విలన్ టచ్చింగ్ మై హీరోయిన్, దిస్ ఈజ్ యాన్ యాక్షన్ ఫిల్మ్ అని పవర్ ఫుల్ డైలాగ్ చెపుతాడు. ఓవరాల్‌గా చూస్తే పైసా వసూల్ సినిమా పక్కా యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది. సినిమాలో భారీ కార్ల ఫైటింగ్, భారీ యాక్షన్ సీన్లు, కార్ల చేజింగ్ సీన్లు, రెయిన్ ఫైట్, బోట్ చేజింగ్ సీన్లు, పూరీ మార్క్ ఐటెం సాంగ్‌తో స్టంపర్ అదిరిపోయింది.
బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు మాస్ అభిమానులు, యాక్షన్ ప్రియులకు పక్కా పైసా వసూల్ సినిమాగా నిలవనుంది. దసరా కానుకగా సెప్టెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.