బాహుబ‌లి యాక్ట‌ర్ల‌లో రాజ‌మౌళి మెచ్చిన ది బెస్ట్ ఎవ‌రో తెలుసా…

బాహుబ‌లి సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ఇలా వీరంద‌రి క‌ష్టం ఐదేళ్లు. వీరితో పాటు సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాయి. ఇక సినిమాలో రాజ‌మౌళి క‌ష్టాన్ని ప‌క్క‌న పెడితే సినిమా కోసం ఐదేళ్ల‌పాటు క‌ష్ట‌ప‌డిన వారిలో ఎవ‌రు బెస్ట్ అన్న ప్ర‌శ్న‌కు ఇండియ‌న్ సినిమా జ‌నాలు ర‌క‌ర‌కాలుగా ఆన్సర్లు ఇచ్చారు.

ఒక‌రు ప్ర‌భాస్‌, మ‌రొక‌రు రానా, దేవ‌సేన‌, క‌ట్ట‌ప్ప ఇలా ర‌క‌ర‌కాలుగా చెప్పుకున్నారు. అయితే సినిమా కెప్టెన్ అయిన రాజ‌మౌళిని ఈ ప్ర‌శ్న వేస్తే మాత్రం వీరెవ్వ‌రూ ది బెస్ట్ కాద‌ని చెపుతున్నాడు. రాజ‌మౌళి తాజా ఇంట‌ర్వ్యూలో బాహుబలిలో అత్యుత్తమంగా నటించింది ఎవరు.. అంటే ఆయన ‘నాజర్’ అని ఆయన ఆన్స‌ర్ ఇచ్చాడు.

ఇందుకు ఆయ‌న క్లారిటీ కూడా ఇచ్చాడు. బాహుబ‌లిలో మిగిలిన అంద‌రికి బ‌ల‌మైన క్యారెక‌ర్లు ఉన్నాయ‌ని… నాజ‌ర్ క్యారెక్ట‌ర్ వీక్ అయినా త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశంలోను తాను ఉన్నాన‌ని నిరూపించాడ‌ని రాజ‌మౌళి మెచ్చుకున్నాడు.