భరత్ స్పీడ్ కు బ్రేక్… ఇలా పడిందా

May 7, 2018 at 2:35 pm
Bharat Ane Nenu, two weeks collections, mahesh babu, reasons

టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద సినిమాల వ‌సూళ్లు, లెక్క‌ల పోస్ట‌ర్లు పెద్ద సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఈ స‌మ్మ‌ర్‌లో వ‌చ్చిన పెద్ద సినిమాల‌పై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రంగ‌స్థ‌లం ఇప్ప‌టికే రికార్డుల దుమ్ము దులిపేసింది. ఈ సినిమా ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.120 కోట్ల షేర్ దిశ‌గా దూసుకు వెళుతోంది. ఇక రంగ‌స్థ‌లం త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల క‌లెక్ష‌న్లు, లెక్క‌ల‌పై పెద్ద ర‌గ‌డ జ‌రుగుతోంది.

 

ఈ రెండు సినిమాల క‌లెక్ష‌న్ల విష‌యంలో నిర్మాత‌లు చేస్తోన్న హ‌డావిడి, వేస్తోన్న పోస్ట‌ర్లు న‌మ్మ‌ద‌గిన విధంగా లేవ‌ని ట్రేడ్ వ‌ర్గాలు, మీడియా వ‌ర్గాలు సందేహం వ్య‌క్తం చేస్తున్నాయి.  రామ్ చరణ్ మూవీ రంగస్థలం.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు.. టాలీవుడ్ కి నాన్ బాహుబలి బిగ్గెస్ట్ హిట్ ఇందులో ఎవ్వ‌రికి ఎలాంటి డౌట్ లేదు. ఆ సినిమాకు ఎవ్వ‌రూ ఊహించ‌ని లాభాలు వ‌చ్చాయి. 

 

ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చిన మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాకు కూడా సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమా రెండు వారాల‌కే రూ. 190.63 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు.. రీసెంట్ గా పోస్టర్ వచ్చింది. మొదటివారం ముగిసేసరికే 160 కోట్లకు పైగా పోస్టర్ వ‌దిలారు. అయితే ఆ త‌ర్వాత 12 రోజుల‌కే రూ.200 కోట్లు వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు 2 వారాల‌కు రూ.190 కోట్లు వ‌చ్చిన‌ట్టు పోస్ట‌ర్ వేశారు. మ‌రి 12 రోజుల‌కు రూ.200 కోట్లు అంటు లీకులు ఇచ్చి ఇప్పుడు 14 రోజుల‌కు రూ.190 కోట్లు అంటూ పోస్ట‌ర్ ఎందుకు వేశారు ? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వినిపిస్తోంది.

 

భ‌ర‌త్ సినిమాకు రామ్‌చ‌ర‌ణ్ నెక్ట్స్ సినిమా ( బోయ‌పాటి డైరెక్ట‌ర్ )కు దాన‌య్యే నిర్మాత‌. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్కే మ‌ల్టీస్టార‌ర్‌కూ దాన‌య్యే నిర్మాత‌. ఇక రంగ‌స్థ‌లం స‌క్సెస్‌ను త‌క్కువ చూపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యం చ‌ర‌ణ్‌కు చేరింద‌ట‌. దీంతో సీరియ‌స్ అయిన చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం వ‌సూళ్ల‌ను ఎందుకు త‌క్కువ చేసి చూపుతున్నారు… ప్ర‌మోష‌న్లు ఎందుకు చేయ‌డం లేద‌ని ఫైర్ అవ్వ‌డంతో పాటు ఫేక్ క‌లెక్ష‌న్ల‌పై సీరియ‌స్ అయ్యార‌ట‌. దీంతో ఇప్పుడు భ‌ర‌త్‌కు 2 వారాల‌కు రూ.190 కోట్లే వ‌చ్చిన‌ట్టు పోస్ట‌ర్లు వ‌దిలార‌న్న‌ది ఇన్న‌ర్ టాక్‌. 

Mahesh

 

భరత్ స్పీడ్ కు బ్రేక్… ఇలా పడిందా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share