భ‌ర‌త్ అను నేనులో ఆ సీన్ ఉండి ఉంటే.. రికార్డ్ బ్రేక్‌! (వీడియో)

May 5, 2018 at 5:16 pm
Bharat Ane Nenu, Uncut scenes, mahesh babu, highlights

రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించిన తాజా సూప‌ర్ స్టార్ మూవీ భ‌ర‌త్ అను నేనులో కొన్ని సీన్ల‌ను క‌ట్ చేశారు. సినిమా ర‌న్నింగ్ టైం పెరిగిన కార‌ణంగా కొన్ని సీన్ల‌ను క‌ట్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన నేప‌థ్యంలో అలా క‌ట్ చేసి, ర‌న్నింగ్ మూవీలో లేకుండా చేసిన కొన్ని స‌న్నివేశాల‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇలా విడుద‌ల చేసిన కొన్ని ఎడిటెడ్ సీన్ల‌లో ఒక‌టి భారీ ఎత్తున వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుత కార్పొరేట్ విద్య జ‌నాల‌ను పీడించుకు తిన‌డం వెనుక ఉన్న ప్ర‌ధాన కార‌ణాల‌ను ఈ సీన్‌లో వివ‌రించాడు ద‌ర్శుకుడు కొర‌టాల శివ‌. దేశ వ్యాప్తంగా విద్యా వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన కార్పొరేట్ విద్య‌పై ఈ మూవీలో కొన్ని సీన్లు ఉన్నాయి. వాటిని తాజాగా యూట్యూబ్‌లో విడుద‌ల చేయ‌డంతో సూప‌ర్ స్టార్ అభిమానులు మురిసిపోతున్నారు. 

 

దేశాన్ని తీవ్రంగా శాసిస్తున్న విద్యా రంగ కార్పొరేటీక‌ర‌ణ‌పై ద‌ర్శ‌కుడు త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డాడు. దీనికి సంబంధించి కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అయితే, మూవీ ర‌న్నింగ్ టైం పెరిగిపోయింద‌నే కార‌ణంగా మూవీ నుంచి వీటిని తొల‌గించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలను, రాజకీయాలను, అన్ని రాజకీయ పార్టీలను శాసించే స్థాయిలో బలపడిపోయిన కార్పొరేట్ విద్యా మాఫియా సీన్ భరత్ లో ఉంది. అయితే,  సినిమా నుంచి క‌ట్ చేశారు. వాస్తవానికి ఇది  ఎంతో బాగుంది. ప్రజలకు సూపర్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది. సీఎంతో సమావేశం అయిన కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులు నేరుగా సీఎం భరత్ తో మీకు ఏమైనా కావాలంటే అందరం కలసి ఇస్తామని ఆఫర్ ఇస్తారు.. అంతే.. విద్యా శాఖ మంత్రి తనయుడిని లాగిపెట్టి చెంప మీద కొడతాడు భరత్.

 

అంతే కాదు..ఇలాంటి చెత్త మీటింగ్ లు మరోసారి ఏర్పాటు చేస్తే బాగుండదని ఏకంగా సీఎస్ కు కూడా వార్నింగ్ ఇస్తాడు భరత్. ఈ సీన్‌ను శివ అదిరిపోయే రేంజ్‌లో చిత్రీక‌రించాడు. నిజంగా సినిమాలో పెట్టి ఉంటే చాలా హైలెట్ అయ్యేదని చెబుతున్నారు. ప్ర‌స్తుతం మ‌రో నెల‌లో స్కూళ్లు తెర‌వ‌నున్న నేప‌థ్యంలో కార్పొరేట్ పాఠ‌శాల‌ల హ‌వా మ‌రింత‌గా పెచ్చుమీర‌నుంది. విద్యార్థుల త‌ల్లిదండ్రులు సైతం కార్పొరేట్‌ఫీజులు క‌ట్ట‌లేక నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. అయిన‌ప్ప టికీ..  ఈ దారుణాన్ని ప‌ట్టించుకుని, ఫీజులు త‌గ్గించే ఉప‌శ‌మ‌న మార్గాల దిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. తాజాగా ఈ స‌మ‌స్య‌ను భ‌ర‌త్ అను నేను మూవీలో చేర్చ‌డం ప్ర‌జ‌ల‌కు ఎంతో సంతోషాన్నిస్తోంది.అయితే, అదేస‌మ‌యంలో టైం చాల‌ద‌నే నెపంతో ఎడిట్ చేయ‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

 

భ‌ర‌త్ అను నేనులో ఆ సీన్ ఉండి ఉంటే.. రికార్డ్ బ్రేక్‌! (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share