భ‌ర‌త్‌కు ఏపీ స‌ర్కార్ షాక్‌..!

April 18, 2018 at 1:21 pm
Bharath ane nenu, premier show, Andhra Pradesh, banned, mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టిస్తోన్న భ‌ర‌త్ అనే నేను సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. సినిమా రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది మ‌హేష్ అభిమానుల‌కే కాకుండా సినీ అభిమానుల‌కు కూడా ఉత్కంఠ ఎక్కువ‌వుతోంది. కొర‌టాల శివ డైరెక్ష‌న్ కావ‌డంతో సినిమా ఎలా ఉంటుందా ? అని ఆంద‌రూ ఆతృత‌తో ఉన్నారు. ఇక ఈ నెల 20న సినిమా రిలీజ్ అవుతుంటే ముందు రోజు గురువారం (19వ తేదీ) అర్ధ‌రాత్రి నుంచే చాలా చోట్ల ప్రీమియ‌ర్ల‌కు ప్లాన్ చేసుకున్నారు.

 

తెలంగాణ‌లో హైద‌రాబాద్‌లో ఈ సంద‌డి మామూలుగానే ఉంటుంది. ఏపీలో అయితే బీ, సీ సెంట‌ర్ల‌లో కూడా అర్ధ‌రాత్రి నుంచే మ‌హేష్ సినిమాల‌కు హంగామా ఉంటుంది. అప్పుడే షోలు వేసేస్తారు. తెల్ల‌వార కుండానే ప్రీమియ‌ర్లు కంప్లీట్ అవ్వ‌డం టాక్ బ‌య‌ట‌కు రావ‌డం జ‌రుగుతుంది. అర్థ‌రాత్రి నుంచే థియేట‌ర్ల‌ను ముస్తాబు చేసి, బాణ‌సంచా కాలుస్తూ, డ‌ప్పుల ద‌రువుతో ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్‌.

 

అయితే తెలంగాణ‌లో గ‌త రెండేళ్లుగా అర్ధ‌రాత్రి షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఇబ్బందులు ఉండ‌డంతో అక్క‌డ రెగ్యుల‌ర్ షోల‌కు మాత్ర‌మే అనుమ‌తులు ఉంటున్నాయి. మ‌హా అయితే ఉద‌యం 6 గంట‌ల‌కో లేదా 8 గంట‌ల షోల‌కు మాత్ర‌మే అనుమ‌తులు ఇస్తున్నారు. ఏపీలో ఈ రూల్స్ లేవు. అయితే కొద్ది రోజులుగా ఇక్క‌డ కూడా నిబంధ‌న‌లు కాస్త క‌ఠినంగా అమ‌ల‌య్యేలా చూస్తున్నారు. సంక్రాంతికి వ‌చ్చిన అజ్ఞాత‌వాసి, జై సింహా సినిమాల‌కు అయితే ఏకంగా 24 గంట‌లు షోలు వేసుకునేందుకు అనుమ‌తులు ఇచ్చింది. 

 

ఇదే క్ర‌మంలో మ‌హేష్‌బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాకు కూడా అనుమ‌తులు వ‌స్తాయ‌ని అనుకున్నారు. ఈ సినిమా బెనిఫిట్ షోల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ కూడా అర్ధ‌రాత్రి షోల వ‌ల్ల భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. ఏదేమైనా ప్ర‌భుత్వం నిర్ణ‌యం మ‌హేష్ ఫ్యాన్స్ ఆశ‌లపై నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌య్యింది. రిలీజ్‌కు మ‌రో రెండు రోజులు ఉండ‌డంతో ఈ లోగా ప్ర‌భుత్వం బెనిఫిట్ షోల‌కు అనుమ‌తులు ఇస్తుందా ? అన్న‌ది చూడాలి. 

 

భ‌ర‌త్‌కు ఏపీ స‌ర్కార్ షాక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share