నాని కోసం మరోసారి యంగ్ టైగర్

June 27, 2018 at 5:10 pm
Big Boss 2, Nani, NTR, re entry, for improve TRP rating

ప్రపంచంలో ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ భారత దేశంలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఇప్పటికే బిగ్ బాస్ పదకొండు సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగు లో బిగ్ బాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చ సుదీప్ లు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక సెకండ్ సీజన్ కూడా ఎన్టీఆర్ వస్తున్నారని ఆశపడ్డారు తెలుగు ప్రేక్షకులు…కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో ఆ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు.

ఇక తెలుగు లో బిగ్ బాస్ మొదలై రెండు వారాలు గడుస్తుంది. కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన సంజన, నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో 13 మంది సెలబ్రెటీలతో పాటు ముగ్గురు కామన్ మాన్ సంజన, నూతన్ నాయుడు, గణేష్ లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇద్దరు ఎలిమినేట్ కాగా గణేష్ తదుపరి వారానికి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. మొదట బిగ్‌బాస్‌ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది. కానీ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో నాని.. ఎన్టీఆర్ కన్నా కాస్త వెనుకబడ్డట్టు తెలుస్తోంది.తొలి సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు కొంచెం వెనుకపడిందని టాక్. అయితే దీని టీఆర్పీని పెంచేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయని సమాచారం. మొదటి బిగ్ బాస్ లో వారం రోజులు ఎలా నడిచినా శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేసే సందడితో టీఆర్ పీ రేటింగ్ ఒక్కసారే పెరిగిపోయేది.

అందుకే మళ్లీ ఎన్టీఆర్ నే తీసుకు రావాలని యాజమాన్యం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా జరగొచ్చు.. ఏ క్షణమైనా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎన్టీఆర్ గెస్ట్‌గా ఎంటర్ అవ్వొచ్చని సమాచారం. ఇదే కనుక జరిగితే బిగ్‌బాస్ సీజన్ 2 రేటింగ్ కూడా అమాంతం పెరగడం ఖాయం. అయితే అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు.

నాని కోసం మరోసారి యంగ్ టైగర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share