బ్రేకింగ్: ‘అరవింద సమేత’ ఎన్టీఆర్ ఆ పాత్రలోనా!

October 9, 2018 at 12:11 pm

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండ‌బోతోంది..? తార‌క్ ఎలా క‌నిపిస్తారు..? అనే ప్ర‌శ్న‌ల చుట్టూ అనేక ఊహాగానాలు వినిస్తున్నాయి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇక ట్రైల‌ర్ విడుద‌ల అయిన త‌ర్వాత అభిమానలోకం ఊగిపోతోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌, డైలాగులు, ఎమోష‌న్ చూశాక‌.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా..అక్ట‌బోర్ 11న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు సంబంధించి కొత్త ముచ్చ‌టొక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది.

Do5cuerVAAATKu0

అర‌వింద స‌మేత ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్‌, పూజా హెగ్డెల మ‌ధ్య సాగే సంభాష‌ణ‌ను గ‌మ‌నిస్తే.. ఒక విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. పూజా హెగ్డెకు ఎన్టీఆర్ బాడీగార్డ్‌గా క‌నిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఓ ప్ర‌మాదం నుంచి పూజ‌ను ఎన్టీఆర్ కాపాడిన త‌ర్వాత ఆమె కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను బాడీగార్డ్‌గా నియ‌మిస్తార‌నీ.. ఆ స‌న్నివేశంలో వ‌చ్చే సంభాష‌ణ ఇదే చెబుతుంద‌నే ఊహాగానాలు వినిస్తున్నాయి. సినిమా ప్రారంభం అంటే.. ఫ‌స్టాప్‌లో ఇదే ఉంటుంద‌ట‌. ఇక ఆ త‌ర్వాత అస‌లు క‌థ మొద‌ల‌వుతుంద‌ని, అదే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంద‌ట‌. అలాగే ఈ సినిమాలో హీరో సునిల్ మ‌ళ్లీ కామెడియ‌న్‌గా అల‌రించ‌బోతున్నాడు.

ఈ సినిమాలో ఆయ‌న‌ది ఫుల్‌లెన్త్ పాత్ర అని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. అంతేగాకుండా.. జ‌గ‌ప‌తి బాబు, నాగ‌బాబు కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. జ‌గ‌ప‌తి బాబు గెట‌ప్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇక సినిమాకు త‌మ‌న్ అందించిన బాణీలు జ‌నాన్ని ఊపేస్తున్నాయి. ముఖ్యంగా పెనిమిటి పాట అంద‌రికీ క‌నెక్ట్ అవుతోంది. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మించిన ఈ సినిమా ద‌స‌రాకు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌ర్వం తెస్తుంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. గురువారం నాడు విడుద‌ల అవుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వుడు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏమేర‌కు అందుకుంటాడో చూడాలి.

బ్రేకింగ్: ‘అరవింద సమేత’ ఎన్టీఆర్ ఆ పాత్రలోనా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share