రకుల్‌ను వదిలిపెట్టని బోయపాటి..

November 18, 2018 at 1:26 pm

టాలీవుడ్లో రకుల్ ప్రీత్ టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. టాప్ హీరోలతో నటిస్తూ.. తానంటే ఏమిటో నిరూపించుకుంటోంది. అయితే.. దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం ఆమె వదిలిపెట్టడం లేదు. తాజాగా.. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్, కియారా అద్వానీ జంటగా వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక బోయపాటి అంటే.. కండలు తిరిగిన హీరో, దుమ్ముదులిపే ఫైట్లు, హాట్ హాట్ ఐటెం సాంగ్స్ తప్పకుండా ఉండాల్సిందే. వినయ విధేయ రామ సినిమా పేరు సాఫ్ట్‌గా పెట్టిన బోయపాటి రాంచరణ్ ఫస్ట్‌లుక్‌తోనే తానెంత రఫ్‌గా ఉంటాడో చెప్పకనే చెప్పాడు.

ఈ ఫస్ట్‌లుక్‌తోనే వినయ విధేయ రామ సినిమా ఎలా ఉంటుందో చెప్పాచేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఇందులో మాంచి ఐటెం సాంగ్ పెట్టాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడట. అదికూడా రకుల్ ప్రతీతో చేయాలనే యోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘ధృవ’ చిత్రంలో హీరోయిన్గా నటించి అలరించిన రకుల్ ప్రీత్.. ఇప్పుడు చెర్రీతో ఐటెం సాంగ్ చేస్తుందన్నమాట.

ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవీ రూపొందించే ఐటెం సాంగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అయితే చెర్రీ, కియారాలతో మాస్ మసాలా సాంగ్‌ను ఆయన కంపోజ్ చేస్తున్నారట. దీనికి మరింత్ డోస్ పెంచేలా రకుల్‌ను రంగంలోకి దింపాలనే ఆలోచనలో బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. ఇంతటితో సరిపెట్టడని తెలుస్తోంది. అయితే.. బోయపాటి సినిమాల్లో ఎక్కువగా రకులే ఐటెం సాంగ్స్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ను కూడా రకుల్‌తో చేయించేందుకు సంప్రదిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక బోయపాటి అడిగితే.. కాదంటుందా.. మరి.

రకుల్‌ను వదిలిపెట్టని బోయపాటి..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share