క్యాస్టింగ్ కౌచ్ ఉచ్చులో మీడియా ఛాన‌ల్ ఎండీ

April 26, 2018 at 5:15 pm
casting couch, news media, channel, tollywood

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న అంశాల్లో క్యాస్టింగ్ కౌచ్ ముందు వ‌రుస‌లో ఉంటోంది. కేవ‌లం సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే ఇటువంటి వ్య‌వ‌హార‌మంతా ఉంటుంద‌ని అంతా భావిస్తుంటే.. రాజ‌కీయాల్లోనూ అందులోనూ పార్ల‌మెంటులోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ కాంగ్రెస్ నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్తుగొలి పేలా చేశాయి. మ‌హిళా సంఘాల నాయ‌కులు ఆందోన‌లు కూడా చేస్తున్నారు. ఇది కేవ‌లం సినిమా, రాజ‌కీయాల్లోనే లేద‌ని అన్ని రంగాల్లోనూ ఉంద‌నే వారు లేకపోలేదు. ప్ర‌స్తుతం మీడియాలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని, సినిమా ఇండస్ట్రీ కంటే మీడియాలోనే ఇది ఎక్కువంటూ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుడు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం క‌లిగిస్తు న్నాయి. 

 

అందులోనూ కొంద‌రు మీడియా సంస్థ‌ల య‌జ‌మానులే నేరుగా భాగస్వాములై ఉన్నారనే వార్త‌లు గుప్పుమం టున్నాయి. ఒక‌ ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత‌పై ఇలాంటివి రావ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరకూ పెద్దగా పట్టించుకోని అంశం క్యాస్టింగ్ కౌచ్‌. టాలీవుడ్‌లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. శ్రీరెడ్డి అనే నటి లేవనెత్తిన దుమారం ఎటు నుంచి ఎటు వైపో మళ్లుతోందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. తాజాగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.  ఇది పరిశ్రమలో  ఎప్పటి నుంచో ఉన్నా ఈ మధ్యే కాస్టింగ్ కౌచ్ అంశంపై దుమారం మొదలైంది. 

 

తెలుగులో కొన్ని ఛానళ్లు కాస్టింగ్ కౌచ్ అంశాన్ని 24×7 అంశంగా మార్చేయటంతో సినీ పరిశ్రమలోని కొంత మంది తీవ్రంగా స్పందించారు. అంతేగాక సినీ ప్ర‌ముఖులు కూడా ఇందులో భాగ‌స్వాములై ఉన్నారంటూ వ‌స్తున్న వార్త‌లు కూడా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. ఇదే అంశంలో మీడియా- సినీ ప‌రిశ్ర‌మ మ‌ధ్య అప్ర‌క‌టిత‌ వార్ న‌డుస్తోంది. ఇఫ్పుడు పరిశ్రమలోని కొంతమంది కొన్ని తెలుగు ఛానళ్లలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఛానళ్ల‌లో అవకాశాలు కల్పించే విషయంలో కొన్ని ఛానల్స్‌లో కూడా ఇదే ట్రెండ్ నెలకొందనే సమాచారం సేకరించారు. 

 

ఇందులో కొన్ని చోట్ల ఏకంగా యాజమాన్యాలే భాగస్వాములు అయిన సమాచారం సేకరించినట్లు పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఒకరు తెలిపారు.  ఒక ప్ర‌ముఖ ఛాన‌ల్ ఎండీ.. యాంక‌ర్లు, ఇత‌ర సిబ్బంది విష‌యంలో  ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఎవరెవరి జాతకాలు ఏమిటో తమకు తెలుసని.. సినీ పరిశ్రమ కంటే ఎక్కువ అరాచకాలు కొన్ని ఛానళ్లలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ అంశాలు అన్నీ కూడా ఆధారాలతో సహా వెలుగులోకి వస్తాయన్నారు. ఈ వ్యవహారం అటు మీడియా ఇటు సినీ పరిశ్రమ మధ్య మరింత గ్యాప్ పెంచేలా కన్పిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

 

క్యాస్టింగ్ కౌచ్ ఉచ్చులో మీడియా ఛాన‌ల్ ఎండీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share