ఛ‌లో TJ రివ్యూ

February 2, 2018 at 11:42 am
Chalo, Review, Naga sourya, reshmika madanna

టైటిల్‌: ఛ‌లో

నటీనటులు: నాగ శౌర్య, రష్మిక మందన 

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ 

మ్యూజిక్: మహానటి స్వర సాగర్ 

ఎడిటింగ్‌:  కోటగిరి వెంకటేశ్వరరావు 

నిర్మాత: ఉష ముల్పూరి 

దర్శకత్వం: వెంకీ కుదుముల 

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

ర‌న్ టైం: 144 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 2 ఫిబ్ర‌వ‌రి, 2018

 

యంగ్ హీరో నాగ‌శౌర్య హీరోగా ప‌రిచ‌యం అయ్యి చాలా సంవ‌త్స‌రాలు అవుతోంది. అయినా ఒక‌టి అరా హిట్లు త‌ప్పా నాగశౌర్య‌కు స‌రైన హిట్ లేదు. అందుకే ఈసారి కాస్త ఎక్కువ బడ్జెట్‌తో ప్రయోగాత్మకంగా చిత్రాన్ని చేసేందుకు నాగశౌర్య సిద్దం అయ్యాడు. నాగశౌర్య తల్లి నిర్మాతగా వ్యవహరించి నిర్మించిన చిత్రం ‘ఛలో’. వెంకీ కుడుముల‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండ‌స్ట్రీ టాక్ ప్ర‌కారం రూ.6 కోట్ల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాకు ప్ర‌మోష‌న్ల‌కే రూ.3 కోట్లు వ‌ర‌కు ఖ‌ర్చు చేశార‌ని వినికిడి. సినిమాపై ఉన్న కాన్ఫిడెంట్‌తోనే ఇంత బ‌డ్జెట్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. క‌న్న‌డ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న నాగ‌శౌర్య స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించ‌గా ఆడియో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెంచింది. ఈ రోజు మంచి అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఛ‌లో అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకుందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

స్టోరీ :

హ‌రి (నాగ‌శౌర్య‌)ది విభిన్న‌మైన మ‌న‌స్త‌త్వం. ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డుతుంటే చూసి ఎంజాయ్ చేయాల‌నుకునే విప‌రీత‌మైన టైప్‌. అది న‌చ్చ‌ని హ‌రి తండ్రి (సీనియ‌ర్ న‌రేష్‌) మ‌నోడిని ఆంధ్రా బోర్డ‌ర్‌లో ఉండే ఓ విలేజ్‌కు పంపేస్తాడు. అక్క‌డ తెలుగు వారికి, త‌మిళుల‌కు గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. అక్క‌డ కంచె వేసుకుని మ‌రీ ఉండే వాళ్లు ఆ కంచె దాటితే ఒక‌రినొక‌రు చంపేసుకుంటూ ఉంటారు. తిరుపురం కాలేజీలో చ‌దువుకున్న హ‌రి కార్తీక‌(ర‌ష్మిక మండ‌న్నా)ను ప్రేమిస్తాడు. అక్క‌డ త‌మిళులు హ‌రిని చంపాల‌నుకుంటారు. హ‌రి వారి ఎటాక్ నుంచి త‌ప్పించుకుంటాడు. చివ‌ర‌కు కార్తీక త‌న ప్రేమ‌ను గెల‌వాలంటే ఆ రెండు వ‌ర్గాల‌ను క‌ల‌పాల‌న్న కండీష‌న్ హ‌రికి పెడుతుంది. అప్పుడు హ‌రి ఏం చేశాడు ? ఆ రెండు ఊళ్లు క‌లిశాయా ?  హ‌రి – కార్తీక ఒక్క‌ట‌య్యారా ?  లేదా ? ఈ మ‌జిలీలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

 

TJ విశ్లేష‌ణ :

సీరియ‌స్ నెస్ లేని సింపుల్ క‌థ‌ను తీసుకుని దానికి కామెడీ మిక్స్ చేసి త‌న‌దైన స్టైల్లో క‌థ‌నం న‌డిపించాడు. త్రివిక్ర‌మ్ స్కూల్ నుంచి రావ‌డంతో ఎక్క‌డ కామెడీ పండించాలో, ఎక్క‌డ డైలాగులు పేల్చాలో బాగా వంట ప‌ట్టించుకున్నాడు. ఫ‌స్టాఫ్ విష‌యానికి వ‌స్తే బావుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రొమాన్స్ మరియు కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇంటర్వెల్ సన్నివేశాల కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌లో కావాల్సిన ఫ‌న్‌తో పాటు తెలుగు, త‌మిళ్ గొడ‌వ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కడంతో ఈ కొత్త పాయింట్ మీద ద‌ర్శ‌కుడు ఆడేసుకున్నాడు. హీరో, హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ కూడా ఆక‌ట్టుకుంది. హీరోయిన్ స్లిప్పులు రాసుకుని కాలేజ్‌కు వెళ్ల‌డం, మందుతాగి హీరోతో గొడ‌వ పెట్టుకోవ‌డంతో పాటు వీరిద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ సినిమాను బాగా లేపింది. ఫ‌స్టాఫ్‌లో హీరోను సైడ్ చేసి మ‌రీ హీరోయిన్ కామెడీ చేయ‌డం కూడా హైలెట్‌.

 

ఇక సెకండాఫ్‌లో తెలుగు, త‌మిళ్ గొడ‌వ‌లు, కంచె నేప‌థ్య, ప్లాస్‌బ్యాక్ ఎంట్రీ ఇవ్వ‌డంతో వినోదం త‌గ్గి, క‌థ‌నం స్లో అవుతుంది. క‌థ‌రీత్యా ఇది త‌ప్ప‌లేదు. అయితే సెకండాఫ్‌లో స్టోరీ ఎక్కువుగా సీరియ‌స్‌గా న‌డ‌వ‌డంతో కాస్త ఆస‌క్తి త‌గ్గినా వెంట‌నే వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఈ పాత్ర సినిమా చూస్తున్న వారికి పెద్ద రిలీఫ్‌. ఓ చిన్న క‌థ‌ను ప‌ట్టుకుని ఎంతో గ్రిప్పింగ్‌గా సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు క్లైమాక్స్‌ను మాత్రం బాగా తేల్చేశాడు. ఇది ప్రేక్ష‌కుడి ఊహ‌కు కూడా అంద‌దు. ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో లాజిక్కులు లేని సీన్లు, ప్రేక్ష‌కుడు ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ కాక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌.

 

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

నాగ‌శౌర్య చాలా జోష్‌తో ఈ సినిమా చేసేశాడు. టైమింగ్ బాగుంది. గ‌త సినిమాల కంటే హుషారెక్కువైంది. హీరోయిన్ ర‌ష్మిక అందం, అభిన‌యం రెండూ బాగున్నాయి. లుక్స్ ప‌రంగానూ ఆక‌ట్టుకుంది. త‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కుతాయి. సెకండాఫ్‌లో ర‌ష్మిక‌ను ద‌ర్శ‌కుడు స‌రిగా యూజ్ చేసుకోలేదు. వెన్నెల కిషోర్‌, స‌త్యం కామెడీ సినిమాకు మేజ‌ర్ హైలెట్. సినిమా క్రెడిట్‌లో వీళ్ల‌కు కూడా మేజ‌ర్ పార్ట్ ఇవ్వాల్సిందే. మిగిలిన వాళ్లు జ‌స్ట్ ఓకే.

 

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే..

టెక్నిక‌ల్‌గా చూస్తే సాయిశ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సాగర్ మ‌హ‌తి సంగీతం, నేప‌థ్య సంగీతం ఓకే. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల వినోదాన్ని బేస్ చేసుకుని ఫ‌స్టాఫ్‌లో బాగా డీల్ చేశాడు. ఎమోష‌న‌ల్‌గా కొన్ని చోట్ల ప్రేక్ష‌కుడిని క‌నెక్ట్ చేయ‌లేక‌పోయాడు. సెకండాఫ్‌తో పాటు, క్లైమాక్స్ ద‌గ్గ‌ర రాజీ ప‌డ‌కుండా ఉండి ఉంటే ఖ‌చ్చితంగా ఛ‌లో రేంజ్ వేరుగా ఉండేది. 

 

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– హీరో హీరోయిన్ పాత్ర‌లు

– సినిమాటోగ్ర‌ఫీ

– మాట‌లు, పాట‌లు

– మ్యూజిక్‌

– ఫ‌స్టాఫ్‌

– కామెడీ

 

మైన‌స్ పాయింట్స్ (-):

– స్మాల్ స్టోరీ లైన్‌

– లాజిక్ లేని స‌న్నివేశాలు

– సెకండాఫ్‌

– క్లైమాక్స్‌

 

ఫైన‌ల్‌గా…

సూప‌ర్బ్ ఫ‌స్టాఫ్‌, యావ‌రేజ్ సెకండాఫ్‌, కంగాళి క్లైమాక్స్‌.. బ‌ట్ జ‌స్ట్ ఓకే

 

ఛ‌లో TJ సూచ‌న : ఓ సారి ఛ‌ల్ ఛ‌ల్ ఛ‌లో

 

ఛ‌లో TJ రేటింగ్‌: 2.75 / 5

 

ఛ‌లో TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share