బుల్లితెర‌పై చిరు ఖైదీ నెంబ‌ర్ 150 బిగ్ ప్లాప్‌

మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా వెండితెర రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింది. ఖైదీ రూ.100 కోట్లు కొల్ల‌గొట్ట‌డంతో పాటు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న బాహుబ‌లి 1 రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేసింది. చిరు 9 యేళ్ల పాటు వెండితెర‌కు దూరంగా ఉన్న ఆయ‌న స్టామినా చెక్కుచెద‌ర‌లేద‌ని నిరూపించింది.

వెండితెర మీద హ‌వా చూపించిన చిరుకు బుల్లితెర మీద మాత్రం ఘోర అవ‌మానం మిగిలింది. తాజాగా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను మా టీవీలో ప్రీమియ‌ర్‌గా ప్ర‌ద‌ర్శించారు. గ‌త ఆదివారం మా టీవీలో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ షోకు అటు మా టీవీ వాళ్లు, ఇటు చిరు అభిమానులు విప‌రీత‌మైన పబ్లిసిటీ చేశారు. తీరా చూస్తే ఈ సినిమాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో 6.9 రేటింగ్స్ వ‌చ్చాయి.

గ‌తేడాది రిలీజ్ అయ్యి భ‌యంక‌ర‌మైన ప్లాప్‌గా నిలిచిన బ్ర‌హ్మోత్స‌వం ఇదే బుల్లితెర మీద ప్ర‌ద‌ర్శిత‌మై 7.52 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంది. అయితే సూప‌ర్ హిట్ అయిన ఖైదీకి బ్ర‌హ్మోత్స‌వం కంటే త‌క్కువుగా 6.9 రేటింగ్ రావ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. ఈ సినిమా బుల్లితెర హ‌క్కుల కోసం ఏకంగా రూ.19 కోట్లు పెట్టిన మా టీవీకి భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేదు. బుల్లితెర‌పై చిరు ఇమేజ్ ఢ‌మాల్ అయ్యింది.