కంచరపాలెం: అసలోళ్లకు తప్ప అందరికీ లాభాలే!

September 10, 2018 at 7:44 am

ఇవాళ టాలీవుడ్ లో కేరాఫ్ కంచరపాలెం చిత్రం ఎంత పెద్ద రేంజి హిట్ చిత్రమో అందరికీ అర్థమైపోయింది. సినిమా అంటే ఇలా ఉండాలి … అన్నట్లుగా దీని గురించి పాజిటివ్ కామెంట్లు పుంఖానుపుంఖాలుగా వినిపిస్తున్నాయి. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందించిన సినిమా ఇది. ఆ సంగతి సినిమా చూసిన ప్రతివారికీ అర్థమవుతుంది. ఇప్పుడు చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ గా ఇది రికార్డులు సృష్టిస్తోంది. మరి ఇన్ని సంచలనాలు నమోదు అవుతున్నప్పుడు సినిమా రూపకర్తలు ఆ సక్సెస్ ను చూడగలుగుతున్నారా? ఫలితాన్ని పొందగలుగుతున్నారా? అనేది ప్రశ్న.

సినిమా పెద్ద సక్సెస్సే గానీ… దానివల్ల అసలు నిర్మాతలు పెద్దగా లాభపడినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని 45 లక్షల అతి తక్కువ బడ్జెట్ తో పూర్తిచేశారనేది సమాచారం. చాలా కాలం మొత్తంగా సినిమా అమ్మేయడానికైనా, విడుదల చేయడానికైనా ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది.

191640

చివరికి దగ్గుబాటి రానా ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మేకర్స్ కు దశ తిరిగింది. మొత్తానికి ఇది సురేష్ ప్రొడక్షన్స్ వారి చిత్రంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే సురేష్ బాబు ఈ చిత్రాన్ని 75 లక్షలకే కొనుక్కున్నారని సమాచారం. (అయితే నిర్మాణం 55 లక్షలకు పూర్తయిందని, 1.10 కోట్లకు కొన్నారని కూడా కొందరు అంటున్నారు.) సురేష్ బాబు అయిష్టంగానే సినిమాను కొన్నారు గానీ.. ఆ తర్వాత వారికి విపరీతమైన లాభాలు కురిశాయి.

ఓవర్సీస్ విడుదల హక్కులనే 1.20 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తోంది. మరోవైపు విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. ఇక శాటిలైట్ తదితర హక్కులు విక్రయించే అవకాశం ఇంకా మిగిలే ఉంది. కలెక్షన్లు కూడా హోరెత్తించేస్తున్నాయి. అలా చూసినప్పుడు.. ఈ సినిమా సక్సెస్ ద్వారా అసలు నిర్మాతలు లాభపడింది చాలా తక్కువ. అయితే.. సినిమాను టోకుగా కొన్నందుకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మాత్రం భారీగా లాభపడింది. అయినా మేకర్స్ మాత్రం పెద్దగా బాధపడడం లేదుట. వారు సినిమా విడుదల చేసుకోవడానికే చాలా కష్టాలు పడ్డారు. కేవలం సురేష్ ప్రొడక్షన్స్ తీసుకున్నందువల్ల మాత్రమే ఈ రేంజి సక్సెస్ వచ్చిందని.. అందుకు థాంక్స్ చెప్పుకోవాలని అనుకుంటున్నారు.

Co Kancharapalem movie Celebrity Premier Show (1)

కంచరపాలెం: అసలోళ్లకు తప్ప అందరికీ లాభాలే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share