సాయిధ‌ర‌మ్ “విన్న‌ర్” కు అడ్డుప‌డుతోందెవ‌రు..!

February 21, 2017 at 6:10 am
winner-saidharm tej-telugu cinema -news

టాలీవుడ్లో ఈ యేడాది జ‌న‌వ‌రి నెల ఘ‌నంగా ప్రారంభ‌మైంది. సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాక సింగం 3 – ఓం న‌మో వేంక‌టేశాయ లాంటి సినిమాలు వ‌చ్చినా వ‌సూళ్ల‌లో జోరు చూపించలేదు. ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన నాని నేను లోక‌ల్ సినిమా ఒక్క‌టి మాత్ర‌మే రిలీజ్ అయ్యింది. ఇక రానా ఘాజీకి సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏ రేంజ్‌లో వ‌సూళ్లు సాధిస్తుందో చూడాలి.

మ‌రో మూడు రోజుల్లో మ‌రో ఒకే రోజు మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వార్‌కు రెడీ అవుతున్నాయి. ఈ వారం విన్న‌ర్‌, య‌మ‌న్‌, ల‌క్ష్మీ బాంబ్ సినిమాలు విడుద‌లకు సిద్ధ‌మ‌య్యాయి. విన్న‌ర్‌, య‌మ‌న్‌ల‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొన్న చిత్రం విన్న‌ర్‌. ట్రైల‌ర్‌, ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం సినిమా త‌ప్ప‌కుండా హిట్ అంటున్నారు.

ఇదే టైంలో విన్న‌ర్ జోరుకు య‌మ‌న్ బ్రేకులేసే ఛాన్సులు కూడా ఉండొచ్చు అంటున్నారు. గ‌త స‌మ్మ‌ర్‌లో సాయి సుప్రీమ్‌, విజ‌య్ ఆంటోనీ బిచ్చ‌గాడు వారం తేడాలో రిలీజ్ అయ్యాయి. అప్పుడు సుప్రీమ్‌పై బిచ్చ‌గాడు పైచేయి సాధించింది. ఇక ఇప్పుడు వ‌స్తోన్న య‌మ‌న్ సైతం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో ఈ సినిమా కూడా బాగుంద‌న్న టాక్ వ‌స్తోంది.

టాలీవుడ్‌లో పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. దీంతో ఈ సినిమా కూడా బీ, సీ సెంట‌ర్ల‌లోనే విన్న‌ర్‌కు గ‌ట్టి పోటీ ఇస్తుందంటున్నారు. ఇక చాలాసార్లు వాయిదాలు ప‌డిన మంచుల‌క్ష్మి లక్ష్మీబాంబ్ కూడా అదే రోజు వ‌స్తోంది. ఈ సినిమా సంగ‌తి ఎలా ఉన్నా ఈ వారం టాలీవుడ్‌లో విన్న‌ర్ వ‌ర్సెస్ య‌మ‌న్ మ‌ధ్య గ‌ట్టి ఫైట్ త‌ప్పేలా లేదు.

సాయిధ‌ర‌మ్ “విన్న‌ర్” కు అడ్డుప‌డుతోందెవ‌రు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share