బక్క చిక్కిన రానా…ఏమైంది?

July 12, 2018 at 1:23 pm
daggubati rana, Venkatesh movie lauch, event, shaking look

టాలీవుడ్ చరిత్రంలో బాహుబలి, బాహబలి 2 సినిమాంటే ఎంత క్రేజ్ ఉందో అందిరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగుగోడి సత్తా ఏంటో చూపించిన సినిమా బాహుబలి సీరస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో బాహుబలి గా ప్రభాస్ కి ఎంత పేరు వచ్చిందో..భళ్లాలదేవుడిగా రానా కు అంతే పేరు వచ్చింది. ఇద్దరు హైట్ పర్సనాలిటీ సరిధీటుగా ఉన్నారు. ఈ సినిమాలో తెగబలిసిన అడవి దున్నతో పోరాడినపుడు రానా కండలు తిరిగిన బాడీతో ఎంత ఆకట్టుకున్నాడో చూశాం.

రానా తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్న రానా ఆ మద్య తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మంచి విజయం అందుకున్నాడు. తాజాగా రానా కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేనే రాజు నేనే మంత్రిలో బ్రిడ్జి మీద పడిపోతున్న కారును తన పిక్క బలంతో ఆపిన రానాయేనా… ఈ రానా ? అని పై ఫొటో చూసిన వారు అవాక్కవుతున్నారు.

కొందరయితే పై ఫొటోలో రానాను గుర్తించడమే కష్టమైపోయిందంటున్నారు. బుధవారం బాబీ దర్శకత్వంలో వస్తున్న వెంకీ-నాగ చైతన్య సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. మీడియాను పిలవలేదు. కేవలం యూనిట్ ఫొటోగ్రాఫర్ మాత్రమే కొన్ని ఫొటోలు తీశారంతే. ఇదిలా ఉంటే ఈ మద్య రానా ఆరోగ్యం పై వచ్చిన రూమర్స్ ను అటు సురేష్ బాబు ఇటు రానా కూడా ఖండించారు. రానా తన తరువాత సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అందుకే అది రివీల్ కాకుండా వుండేందుకు ఆ చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నారట. తాజాగా రానా కు సంబంధించి ఫోలో చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు.

బక్క చిక్కిన రానా…ఏమైంది?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share