‘దేవదాస్’ ట్రైలర్…నవ్వుల విందు

September 20, 2018 at 10:28 pm

నాగార్జున , నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ‘దేవదాస్’ కొద్దీ సేపటి క్రితమే మ్యూజిక్ పార్టీ ఈవెంట్ ఏర్పాటు చేసి ఘనంగా ట్రైలర్ విడుదలాచేసారు. దేవదాసు అంటే మనకు టక్కున గుర్తుచ్చేది అక్కినేని నాగేశ్వరావు నటించిన విషాదాంత ప్రేమకథ. ఆ సినిమా ఆ రోజుల్లో సూపర్ హిట్ అయి నాగేశ్వరుకు, సావిత్రికి మంచి పేరు తెచ్చిపెట్టింది…కానీ ఈ మల్టీ స్టారర్ మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గా వుండేలా కనిపిస్తోంది. 2:06నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, కామెడి, యాక్షన్ కలిపి రంగ రించినట్టుంది.

x1080-nGj

ఇక నాగ్ విషయానికి వస్తే ఆఫీసర్ సినిమాతో అక్కినేని అభిమానులను త్రీవ నిరాశ పరిచాడు, మళ్లీ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడని అక్కినేని అభిమానులను ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు, నాని వైద్యుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్లో చూస్తుంటే నాగ్ నానికి పేషంట్ గా పరిచయమై నాని మూడ్ మర్చి కామెడీ చేస్తూ లవర్ బాయ్ ను చేసాడనిపిస్తుంది.

అలాగే నాగ్ తన ఫ్లాష్ బ్యాక్ ఎదురైనా ప్రేమ గురించి గుర్తు చేసుకుంటూ, నానితో షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా యాక్షన్, కామెడీ, లవ్ మిక్స్ చేసి వదిలినట్టుంది. శ్రీ రామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు, అలాగే గీత గోవిందం ఫేమ్ రష్మిక నాని లవర్ గా నటిస్తుంది, ఆకాంక్ష నాగ్ లవర్ గా నటిస్తుండగా మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. సావిత్రి మూవీ తో బౌన్స్ బ్యాక్ అయిన వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుంది.. ఈనెల 27న రిలీజ్ కు రెడీ అవుతుంది. చూద్దాం ఫన్నీ దేవదాస్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో…

‘దేవదాస్’ ట్రైలర్…నవ్వుల విందు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share