దిల్ రాజుకు ఫిదా క్లైమాక్స్ అర్థం కాలేదా..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు సినిమా అంటేనే ప్ర‌తి అడుగులోను ఆయ‌న ఇన్వాల్‌మెంట్ ఉంటుంది. క‌థ ఎంపిక ద‌గ్గ‌ర నుంచి షూటింగ్‌, ఫైనాన్స్ కంట్రోల్ ఇలా విష‌యాల‌ను ఆయ‌న ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు అవుట్ ఫుట్ చూసుకుంటూ ఆయ‌న మార్పులు సూచిస్తుంటారు. ఇక ఎడిటింగ్‌లోను ఆయ‌న హ్యాండ్ ప‌డాల్సిందే అంటారు.

అలాంటి దిల్ రాజు త‌న తాజా సినిమా ఫిదా విష‌యంలో మాత్రం ఆయ‌న జోక్యం ఏ మాత్రం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. ఫిదా నూటికి నూరు శాతం శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు రాజు. ఇక రాజు మరో షాక్ కూడా ఇచ్చారు. ఫిదా క్లైమాక్స్ త‌న‌కు అస్స‌లు అర్థం కాలేద‌ని రాజు చెప్పాడు.

ఫిదా క్లైమాక్స్ బాన్సువాడ‌లో జ‌రుగుతున్న‌ప్పుడు షూటింగ్ చూద్దామ‌ని రాజు వెళ్లాడ‌ట‌. అప్పుడు రాజు పేప‌ర్ మీద ఉన్న క్లైమాక్స్ చూస్తే ఆయ‌న‌కు అస్స‌లు అర్థం కాలేద‌ట‌. ఆ విష‌యాన్ని శేఖ‌ర్‌కు చెపితే ఆయ‌న ఎక్క‌డ డిస్ట‌ర్బ్ అవుతాడేమోన‌ని, ప్రెజ‌ర్ ఫీల‌వుతాడ‌న‌ని రాజు మౌనంగా ఉన్నాడ‌ట‌.

ఇక‌ నిర్మాతగా తన కెరీర్లో తన ప్రమేయం అతి తక్కువగా ఉన్న సినిమా కూడా ఇదే అన్నాడు రాజు. అమెరికా షెడ్యూల్ జరుగుతుండగా అక్కడికి వెళ్తే.. తన భార్య చనిపోయినట్లు తెలియడంతో వెనక్కి వచ్చేశానని చెప్పిన రాజు…అవుట్ ఫుట్ విష‌యంలో మాత్రం తాను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని చెప్పారు. ఏదేమైనా ఫిదా విష‌యంలో రాజు ఫుల్ కాన్ఫిడెన్స్‌తోనే ఉన్న‌ట్టు ఆయ‌న మాట‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.