40రూపాయల నుంచి 40 కోట్లకు

August 20, 2018 at 4:22 pm

మనిషి తలుచుకుంటే ఎంతటి క్లిష్ట కార్యాలనైనా సునాయసంగా సాధించవొచ్చు..మనం నడిచే బాటలో ఎన్నో కష్టనష్టాలు ఉండొచ్చు..కానీ వాటన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటే..ఉన్నత స్థానం చేరవొచ్చు..దాదాపు ఇలాంటి మాటలే ‘గీతాగోవిందం’ సక్సెస్ కార్యక్రమంలో మాట్లాడారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అయితే ఈ మాటలు ఎవరి గురించో తెలుసా..సహ నిర్మాత వాసు.

అవును నిన్న జరిగిన గీత గోవిందం సక్సెస్ మీట్ నిర్మాత వాసుని ఆకాశానికి ఎత్తాడు దిల్ రాజు. తన జీవితంలో ఒకప్పడు జరిగిన చిన్న సంఘటన గుర్తు చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే..గతంలో అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమా రిలీజ్ అయిన సమయంలో దిల్ రాజు దగ్గరికి బన్నీ వాస్ పాలకొల్లు సెంటర్ రైట్స్ కావాలని వచ్చాడట. ఒక్కటే ఎందుకు మొత్తం వెస్ట్ గోదావరి తీసుకోమని సలహా ఇచ్చాడట..కానీ వాసు మాత్రం తన జేబులో ప్రస్తుతం 40 రూమాలు మాత్రమే ఉన్నాయి..ఇవి అడ్వాన్స్ గా తీసుకోండి అని చేతిలో పెట్టాడు.

What-Dil-Raju-Gain-With-Tholi-Prema--1518606572-1760

అప్పడు నాకు ఆశ్చర్యం అనిపించినా..తాను ఇప్పుడు ఈ స్థాయికి రావడం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. వాస్తవానికి దిల్ రాజు కి ఇచ్చిన 40 రూపాయల ప్రయాణంతో ఇప్పుడు 40 కోట్ల స్థాయికి చేరుకున్నాడు..అంటే ‘గీతా గోవిందం’ఈజీగా 40 కోట్లు దాటే స్థాయికి వచ్చింది. తెరపై నిర్మాతగా తన పేరు పడటం కొత్తేమీ కాకపోయినా..ఈ సినిమా వాసుకి చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు.

గతంలో నలభై రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తన ప్రస్థానం మొదలు పెట్టిన వాసు ఇప్పుడు దిల్ రాజు సినిమాకే పోటీగా నిలిచి అత్యధిక వసూళ్లు చేస్తే స్థాయికి ఎదిగారు. ఈ సందర్భంలో త్వరలో గీతాగోవిందం దర్శకులు పరుశరామ్ తో మరో భారీ సినిమాకు ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఈవెంట్ కి విచ్చేసిన ప్రముఖులు అందరూ వాసుని ఆకాశానికి ఎత్తారు.

40రూపాయల నుంచి 40 కోట్లకు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share