దిల్ రాజు కాస్త ‘డల్ రాజు’ అయ్యాడే!

November 3, 2018 at 12:45 pm

ప్రేక్ష‌కుల నాడి క‌నిపెట్టి సినిమాలు తీయ‌డం.. హిట్లు కొట్ట‌డం.. వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌డం దిల్ రాజు స్టైల్‌. కానీ ఇది గ‌త మాట‌గానే మిగిలిపోతుందా..? అనే డౌటు ఇండ‌స్ట్రీలో వ‌స్తోంది. జ‌నం నాడి ప‌ట్టుకోవ‌డంలో గాడి త‌ప్పాడా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. దాదాపుగా గ‌త ఎడాది నుంచి ఆయ‌న అంచ‌నాలు త‌ల‌కిందులు అవుతున్నాయి. లవర్‌, శ్రీనివాస కళ్యాణం లాంటి చిత్రాలు దిల్‌ రాజు బ్యానర్ స్థాయిని బాగా త‌గ్గించాయ‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

Dil-Raju-Wiki

ఇక దసరా కానుక‌గా విడుద‌ల అయిన‌ ‘హలో గురు ప్రేమకోసమేస ఫ్లాప్ కాలేదు. అలాగ‌ని హిట్ కూడా అందుకోలేదు. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయింది. అయితే.. రామ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌మోష‌న్ వ‌ర్క్ కూడా విప‌రీతంగా చేసినా.. స‌త్ఫ‌లితాలు రాలేదు. ఇదిలా ఉండ‌గా.. గ‌త ఏడాది దిల్ రాజు ఆరు సినిమాలు తీశాడు. ఇక ఈ ఏడాది సుమారు ఏడు సినిమాలైనా తీయాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాడు. కానీ.. మూడు సినిమాలు మాత్ర‌మే వ‌చ్చాయి.

అయితే… ఒక్క‌టి కూడా హిట్ కొట్టలేదు. దీంతో దిల్ రాజుకు డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందా..? అనే సందేహాలు ఇండ‌స్ట్రీలో వ‌స్తున్నాయి. నిజానికి గ‌త ఏడాది తీసిన సినిమాలు ప‌ర‌వాలేద‌ని అనిపించాయి. మ‌ళ్లీ గాడిలో ప‌డుతున్నాడ‌ని అనుకున్నారు. కానీ.. ఈ ఏడాది తీసిన సినిమాల‌న్నీ కూడా విజ‌యం సాధించక‌పోవ‌డంతో ఈ సందేహాలు వ‌స్తున్నాయి. ఇక వ‌చ్చే ఏడాదిపైనే ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌తో తీస్తోన్న ‘ఎఫ్ 2` సినిమా వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల కానుంది. వేసవిలో మహేశ్ న‌టిస్తున్న‌ ‘మహర్షి’ వస్తుంది. ఇవి ఏం చేస్తాయో చూడాలి మ‌రి.

దిల్ రాజు కాస్త ‘డల్ రాజు’ అయ్యాడే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share