దిల్ రాజు కాంపౌండ్ నుంచి సొంత హీరో

July 13, 2018 at 4:26 pm
Dilraju, banner, hero, sirish son, tollyood entry

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో మంది కొత్త నటీ,నటులకు అవకాశం ఇచ్చారు. ఇండస్ట్రీలో ఒక్కరిద్దరు తప్ప అందరు హీరోలతో సినిమాలు నిర్మించారు. అయితే ఈ మద్య ఇండస్ట్రీలో వారసుల జోరు బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ మద్య దిల్ రాజు తన కజిన్ శిరీష్ ని భాగస్వామిగా తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన కజిన్ శిరీష్ కుమారుడు ఆశిష్ ను హీరోగా పరిచయం చేయబోతున్నారు.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అనుకున్నప్పటికీ గతంలో సిద్దార్థతో తీసిన ‘బొమ్మరిల్లు’ లాంటి హార్ట్ టచింగ్ కథ కోసం ఎదురు చూస్తున్నారట. ఇప్పుడు దాదాపు అది ఫైనల్ కు వచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజకు ఇష్టమైన బొమ్మరిల్లు సినిమాకు ఎక్స్ టెన్షన్ అనే విధంగా ఓ మాంచి కథను, ఓ కొత్త దర్శకుడు తయారుచేసాడు. దాన్ని సానబెట్టి, అన్ని విధలా రెడీ చేసారు. కొత్త దర్శకుడితో ఆశిష్ హీరోగా ఆ సినిమాను దసరాకు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

కాకపోతే రెగ్యూలర్ షూటింగ్ మాత్రం జనవరిలో ఉంటుందట. అంతే కాదు ఈ సినిమా టైటిల్ ‘పలుకే బంగారమాయె’ ఫిక్స్ చేశారట. దీనికి ఓ ఉపశీర్షిక అంటే ట్యాగ్ లైన్ కూడా వుంది. బొమ్మరిల్లులో అన్నది ఆ ట్యాగ్ లైన్. కాగా, 80వ దశకంలో రచయితగా దాడి వీరభద్రరావు రాజకీయాల్లోకి రాకముందు రాసిన నాటకం. చాలా పాపులర్ ఆ రోజుల్లో. దానికీ దీనికీ సంబంధం ఏమీలేదు.

దిల్ రాజు కాంపౌండ్ నుంచి సొంత హీరో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share