పవన్ బన్నీ వార్ కు భయపడుతున్న డైరెక్టర్

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌టౌట్ ఉంటే చాలు ప్లాప్ సినిమాల‌కు కూడా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంది. ఇక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇటీవ‌ల టాలీవుడ్ స్టార్ హీరోల‌కు షాక్ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మెగా అభిమానుల్లో ఈ ఇద్ద‌రు హీరోల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గ‌త కొద్ది రోజులుగా జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ప‌వ‌ర్‌స్టార్ వ‌ర్సెస్ స్టైలీష్‌స్టార్ మ‌ధ్య చిన్న‌పాటి కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. హీరోల మ‌ధ్య ఎలా ఉన్నా ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య మాత్రం సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్ జ‌రుగుతోంది.

ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల వార్‌లో ఓ డైరెక్ట‌ర్ బాగా న‌లిగిపోతున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ టాక్‌. బ‌న్నీ లేటెస్ట్ మూవీ డీజే ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌. ఆయ‌న గ‌తంలో ప‌వ‌న్‌తో గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి హిట్ సినిమా తీశాడు. గ‌తంలో బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ చేసిన కామెంట్ల త‌ర్వాత వీరి అభిమానుల మ‌ధ్య భ‌గ‌భ‌గ మంటూ మంట‌లు మండుతున్నాయి. ఇక బ‌న్నీ డీజే టీజ‌ర్ ఇండియాలోనే ఎక్కువ డిజ్‌లైక్‌లు తెచ్చుకున్న టీజ‌ర్‌గా చెత్త రికార్డు మూట‌క‌ట్టుకుంది. దీని వెన‌క ప‌వ‌న్ ఫ్యాన్స్ ఉన్నార‌న్న సందేహాలు తెలిసిందే.

ఇక డీజే జూన్ 23న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా టార్గెట్ చేస్తారో అని ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌కు ఒక్క‌టే టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను శాంతింప‌జేసేలా ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తెస్తే బ‌న్నీకి కోపం వ‌చ్చేలా ఉంద‌ట వ్య‌వ‌హారం. ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తేక‌పోతే ఆ ఫ్యాన్స్ నుంచి డీజేపై అదిరిపోయే రిటాక్ట్‌లు ఖాయం.

ఇటీవ‌ల కాట‌మ‌రాయుడు రిలీజ్ టైంలో మెగా హీరోలంద‌రూ ట్వీట్లు చేసినా బ‌న్నీ మాత్రం స్పందించ‌లేదు. దీంతో ప‌వ‌న్‌తో బ‌న్నీకి ఉన్న గ్యాప్ బ‌య‌ట‌ప‌డిన‌ట్ల‌య్యింది. ఏదేమైనా ఇప్పుడు హ‌రీశ్‌శంక‌ర్ అటు ప‌వ‌న్ ఇటు బ‌న్నీ వార్‌లో న‌లిగిపోతున్నాడ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.